పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు మాసాలు కలసి జీవితకాలమాతాయి. మనం కాలం లోనే జీవిస్తాం. అసలు కాలమే జీవితం. కాలాన్ని సరిగా వాడుకొంటే జీవితం ఫలప్రదమౌతుంది. లేకపోతే నాశమైపోతుంది.

5. కాలాన్ని అదుపుచేయాలి

కాలాన్ని మనం సృజించలేం. భగవంతుడుడే దాన్ని పుట్టించి మనకు ఉదారంగా దయచేస్తాడు. ఐనా మనం దాన్ని అదుపులో వుంచుకొని సక్రమంగా వాడుకోవాలి. కాలమనే పడవను మన యిష్టం వచ్చినట్లుగా నడుపు కోవాలి. దానిద్వారా మనం కోరుకొన్న గమ్యాన్ని చేరుకోవాలి. విజయాలు సాధించాలి.

కాలం మనలను నడిపించకూడదు. మనమే దాన్ని నడిపించాలి. పారుతున్న ఏటిలో పడినవాడు నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతాడు. ఆలాగే మనం కాల ప్రవాహంలో కొట్టుకొని పోకూడదు. కాలమనే గాలికి దూది పింజలాగ ఎగిరిపోకూడదు. రౌతు గుర్రాన్ని నడిపంచాలి గాని గుర్రమే రౌతుని నడిపించకూడదు.

సమయాన్ని సరిగా వాడుకొనేవాళ్లు ఎన్నో విజయాలు సాధించి చిరస్మరణీయులు ఔతారు. సమయాన్ని వ్యర్థం జేసికొన్నవాళ్లు ఊరూపేరూ లేకుండ పోతారు.

16. హానికరమైన పదార్థాలు సేవించకూడదు

చిన్నపిల్లలు వాళ్ల దేహాలను గూర్చి పట్టించుకోరు. కాని నరులు పెరిగి పెద్దయ్యేకొద్ది తమ శరీరాలను గూర్చి జాగ్రత్త పడతారు. శరీరం ఆరోగ్యంగా వుంటే దీర్ఘకాలం జీవించవచ్చు సమర్థవంతంగా పనిచేయవచ్చు అనుకొంటారు. యువతలో ఈ శరీర స్పృహ మరీ యొక్కువ.

కొన్ని రసాయన పదార్థాలు మన శరీరం మీద దుష్ప్రభావం చూపుతాయి. శరీరాన్ని వ్యాధిగ్రస్తం చేసి నాశం చేస్తాయి. వీటికే "హానికరమైన పదార్థాలు" అని పేరు. మామూలుగా హెరాయిన్, కొకేన్, గంజా మొదలైన వాటిని హానికర పదార్థాలుగా పేర్కొంటారు. ఇంకా చాలా రకాల పదార్థాలు