పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది వెళ్లిపోతూంటుంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా వాడుకోవడమే మనపని. కాలమనే అమూల్య సంపదను సద్వినియోగం జేసికొనేవాడే బుద్ధిమంతుడు.

15. కాలాన్ని గూర్చిన ముఖ్య విషయాలు

1. కాలాన్ని డబ్బిచ్చి కొనుక్కోము : ఆహారపదార్థాలు, బట్టలు మొదలైనవాటిని డబ్బు చెల్లించి కొనుక్కొంటాం. కాలాన్ని ఈలా డబ్బిచ్చి కొనం. భగవంతుడు దాన్ని మనకు ఉచితంగానే దయచేస్తాడు. ఊరికే వస్తుంది కనుకనే చాలమంది దాన్ని తేలికగా తీసికొంటారు. వృధా చేస్తారు. ఒక గంట కాలానికి ఇంత సొమ్మ చెల్లించాలి అనే నియమం వుంటే జాగ్రత్తగా మెలుగుతాం.

2. అందరికీ రోజుకి 24 గంటలే : భగవంతుడు పక్షపాతం లేకుండ అందరికీ రోజుకి 24 గంటలే దయచేస్తాడు. పేదలకూ, ధనికులకూ, తెలివైన వాళ్లకూ తెలివిలేని వాళ్లకూ, స్త్రీలకూ పురుషులకూ అందరికీ రోజుకి 24 గంటలే. ఐనా కొందరు ఈ 24 గంటల సమయాన్ని చక్కగా వినియోగించుకొని ఫలితాన్ని పొందుతారు. కొందరు అదే కాలాన్ని దుర్వినియోగంజేసి నష్టపోతారు.

3. కాలం నిర్ణీతక్రమంలో సాగిపోతుంది : కొన్నిసార్లు కాలంలో మార్పు వచ్చినట్లుగా కన్పిస్తుంది. పిల్లలకు కాలం త్వరగా గడచిపోతుంది. వాళ్లకు రోజుకి పదిగంటలే ఉన్నట్లనిపిస్తుంది. వయసు మళ్లిన ముసలివాళ్లకు సమయం త్వరగా గడవదు. వీళ్లకు రోజుకి 40 గంటలు ఉన్నట్లనిపిస్తుంది. ఆనందంగా ఉన్నప్పడు కాలం త్వరగా సాగిపోతుంది. అదే కాలం విచారంగా ఉన్నప్పడు అట్టే గడవదు. ఐనా కాలంలో మార్పేమీ వుండదు. అది యెప్పుడూ నిర్ణీత క్రమంలోనే పోతుంది. మన మనసులోని ఆలోచనలను బట్టి మార్పు వచ్చినట్లనిపిస్తుంది. మారేది మనం గాని కాలం గాదు. ఇంకా, కాలం ఎవరికోసం ఆగదు. దాని వేగంతో అది కదలిపోతూనే వుంటుంది.

4. కాలమంటే జీవితమే
కాలం అమూల్యమైంది. జ్ఞ్యూశం విలువైంది. కొన్ని