పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ సౌందర్యాన్ని వృద్ధిచేసుకొంటాయి. ఆలాగే ఉత్తముడు ఎప్పటికప్పుడు తన లోపాలను సవరించుకొని సభ్యతాసంస్కారాలను ఇనుమడింప జేసికోవాలి. అసభ్యంగా మెలిగినప్పడు ఇతరులను గుర్తించం. వారిపట్ల గౌరవంతో మెలగం, మర్యాదగా మెలిగినప్పడు ఇతరులను గుర్తిస్తాం. వారిని విలువతో చూస్తాం. నేనెంతో నీవూ అంత అన్నట్లుగా ప్రవర్తిస్తాం. కనుక ఎప్పుడూ మర్యాదను పాటించాలి. అది మనిషి సంస్కారానికి కొలత బద్ద


13. సమాజంలో రాణించాలంటే

నేటి సమాజంలో రాణించాలంటే కొన్ని మెలకువలను పాటించాలి. వీటిని 8ంcial SkiLLs అంటారు. ఈ క్రింద కొన్నిఅంశాలను పరిశీలిద్దాం.

1. దుస్తులు

మనం ధరించే దుస్తులు నీటుగా, ఒద్దికగా వుండాలి. ఐనా వస్త్రధారణం కృత్రిమంగా వుండకూడదు. నిగనిగలాడే మెరుపు రంగు దుస్తుల్ని జనం మెచ్చుకోరు. సాదా రంగులే మంచివి. చూచేవాళ్ల దృష్టి దుస్తుల మీద కాక మనమీదనే పడేలా వుండాలి.

2. నవ్వు మొగం

నవ్వడం చేతగానివాడు అంగడి తెరవకూడదు అని చెప్తుంది ఓ చైనా సామెత. నవ్వు ముఖాన్ని వెలిగిస్తుంది. ఎదుటివాళ్లకు మన మీద ఇష్టమూ, సానుభూతీ పుట్టేలా చేస్తుంది. శరీరంలోని వొత్తిడిని తొలగించి ఆరోగ్యం చేకూరుస్తుంది. మామూలుగా పురుషులకంటె స్త్రీలు ఎక్కువగా నవ్వుతారు. అందరూ నవ్వుతూ మాట్లాడ్డం అలవాటు చేసికోవాలి.

3. మన స్వరం

మన స్వరాన్ని బట్టి కూడ ప్రజలు మనకు విలువ నిస్తారు. మరీ పెద్దగా గానీ, మరీ మెల్లిగాగానీ మాట్లాడ కూడదు. మన మాటలు ఎదుటి వాళ్లకు స్పష్టంగా విన్పించేలా వుండాలి. మాటల్లస్తు మింగివేయకుండ గట్టిగా పలకాలి.