పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
5. సభ్యతా సూత్రాలు

మన ప్రవర్తనం ఎప్పడు కూడ సభ్యంగా వుండాలి. దానికి కొన్ని సూత్రాలు పాటించాలి.

1. ఇతరులకు సహాయం జేయడానికి సిద్ధంగా వుండాలి. విశేషంగా వృద్దులు, రోగులు, పసిపిల్లలు మొదలైనవారికి సహాయం చేయాలి.

2. స్త్రీలను గౌరవంతో చూడాలి. బస్సులు, రైళ్లు మొదలైన వాటిల్లో వాళ్లను ముందు ఎక్కనీయాలి.

3. మనకంటె పెద్దవాళ్లు వచ్చినప్పడు లేచి నిలబడ్డం మర్యాద.

4. పెద్దగా అరవడం, వివాదానికి దిగడం, ఇతరుల అభిప్రాయాలను ఖండించడం పనికిరాదు.

5. ఇతరుల దుస్తులు, అలవాట్ల, ఆచారాలు మొదలైన వాటిని విమర్శించకూడదు.

6. పేద దుస్తులు ధరించి వచ్చినవాళ్లతోను, నాజూకుగా మాట్లాడలేని వాళ్లతోను అమర్యాదగా ప్రవర్తించకూడదు.

7. ఇతరులను ఎగతాళి చేయడం, వారి శరీర సంజ్ఞలను గేలి చేయడం పనికిరాదు.

8. మనదే పొరపాటయినపుడు క్షమాపణం అడుగుకోవడానికి సిగ్గుపడకూడదు.

9. పరుల మతాలు, దేవుళ్లు, ఆరాధనా పద్ధతులను గూర్చి తేలికగా మూటలాడకూడదు.

10. ఇతరులు ఏమిచేస్తే మన మనసుకి కష్టంగా వుంటుందో ఆ కార్యం మనం ఇతరులకు చేయకూడదు. ఎప్పడూ మనలో పెద్దమనిషి వాలకం కన్పించాలి. పెద్దనగరాలు ఒకవైపు తమ చెత్తను వదలించుకొంటాయి. మరోవైపు