పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామూలు వాడుక భాషా పదాలు వాడితే చాలు. మరీ వేగంగా మాట్లాడకూడదు. పెద్దగుంపు ముందు మాట్లాడేటప్పుడు చాల నిదానంగా మాట్లాడాలి.

4. శరీర భంగిమలు

ప్రజలు మన శరీర భంగిమలను గమనిస్తుంటారు. మనం నడిచే తీరూ, కూర్చునే తీరూ, నిలబడే తీరూ పరిశీలిస్తుంటారు. తల పైకెత్తి నిటారుగా నడవాలి. సైనికులు ఈలా నడుస్తారు. చేతుల్ని రొమ్ము మీదా, వీపుమీదా, ప్యాంటు జేబుల్లో పెట్టుకోకూడదు. శరీర భంగిమలు మనకు ఏపాటి ఆత్మవిశ్వాసముందో తెలియ

5. చెప్పిన వేళకు చేరుకోవాలి

ఎక్కడికి వెళ్లినా చెప్పిన వేళకు చేరుకోవాలి. ఆలస్యంగా పోతే జనానికి మనమీద నమ్మకం సన్నగిల్లుతుంది. అవతలివాళ్లు మన కొరకు ఎదురుచూస్తూ కూర్చోకూడదు. ఏ కారణం చేతనైనాసరే చెప్పిన వేళకు చేరుకోలేకపోతే ముందుగా తెలియజేయడం మర్యాద.

6. పేర్లు గుర్తుంచుకోవాలి

అందరికీ తమ పేర్లంటే ఇష్టంగానే వుంటుంది. కనుక మనుషుల్ని పేరెత్తి పిలిస్తే ఎంతో సంతోషిస్తారు. ఎదుటి వాళ్ల పేర్లు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కొందరికి ముఖాలు గుర్తుంటాయిగాని పేర్లు గుర్తుండవు. వీళ్లు ముందుగానే జాగ్రత్త పడాలి.

7. చిన్నచిన్న పొరపాట్ల క్షమించాలి

అందరమూ పొరపాటు చేస్తాం. నరులు తవు అజాగ్రత్తవల్ల అనాలోచితంగానే ఇతరులకు కోపం రప్పిస్తారు. ఇతరుల చిన్నచిన్న పొరపాట్లను క్షమించి ఊరుకోవాలి. వాళ్లమీద కసితీర్చుకొనే ప్రయత్నం చేయకూడదు. మనం తోడివాళ్లను క్షమించేదాన్ని బట్టి వాళ్లు మనలను క్షమిస్తారు.