పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యుచ్ఛక్తిని వినియోగించి వార్తలను శీఘ్రమే ప్రసారం చేస్తున్నారు. శాస్త్రజ్ఞలు టెలిఫోను, రేడియో, సినిమా, టెలివిజన్ మొదలైన ప్రసార సాధనాలను కనిపెట్టారు. ఈ సాధనాల ద్వారా నరులు తమ జ్ఞానాన్ని దీర్ఘకాలం వరకు పదిలపరచుకొంటున్నారు. లక్షలకొలది జనానికి ఆ జ్ఞానాన్ని అందించి వారిలో మంచికిగాని చెడ్డకుగాని మార్పు తెస్తున్నారు. వారికి ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్నారు.

పూర్వులు క్రమంగా మంచుయుగంలో, రాతి యుగంలో, భూస్వామ్య యుగంలో, పారిశ్రామిక యుగంలో జీవించారు. ఇప్పడు మనం ప్రసార మాధ్యమాల యుగంలో జీవిస్తున్నాం. ఇది ప్రధానంగా మాస్ మీడియా యుగం. ప్రసార సాధనాల ద్వారా చాల తావుల్లో వసించే ప్రజా సమూహానికి వార్తలు విశేషాలు అందిస్తారు. కొన్ని క్షణాల్లోనే కోట్లకొలది ప్రజలు వార్తలను స్వీకరిస్తారు. దీన్నే మాస్ కమ్యూనికేషన్ అంటారు. ఈ వార్తా ప్రసారంలో యంత్రాలు ప్రముఖపాత్ర వహిస్తాయని వేరుగా చెప్పనక్కరలేదు.

ఇక్కడ రెండు ముఖ్య విషయాలు గమనించాలి. మొదటిది, మూస్ మీడియా వల్ల మంచి ఫలితం లభించాలంటే ప్రజలకు చదువు సంధ్యలు వుండాలి. చదువు రానివాళ్లకు వార్తాపత్రికలు ఉపయోగపడవు కదా! రెండవది, మాస్ మీడియాను ఉపయోగించాలంటే డబ్బు ఖర్చుపెట్టాలి. సినిమాలకూ దూరదర్శన్లకూ కోట్లకొలది పెట్టుబడి పెట్టాలి. ధనికులు మాత్రమే ఈ పని చేయగలరు. మాస్ మీడియాలో పత్రికలు పుస్తకాలు, రేడియో, సినిమా, టీవీ మొదలైన విభాగాలు వున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. పత్రికలూ, పుస్తకాలూ

పత్రికలను రోజూ చదువుతూనే వుంటాం. అవి రెండు ముఖ్యమైన పనులు చేస్తాయి. దేశంలో జరిగే సంఘటనలను గూర్చిన వార్తలను ఉన్నవాటిని ఉన్నట్లుగా ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తాయి. వర్తమాన సంఘటనలను