పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. ఫలితాలు చూపించాలి

  చాలమంది ఏదో చేస్తున్నట్లుగానే నటిస్తారు. కాని ఫలితం మాత్రం శూన్యం. మన పనులు సత్ఫలితాన్ని ఇచ్చినప్పుడే విజయాన్ని సాధించినట్లు. చెట్టుకి ఆకులు కాదు, కాయలు ముఖ్యం. 

8. శ్రమించి పనిచేయడం

శ్రమించి పనిచేయకుండ ఇంతవరకు ఎవరూ గొప్పవాళ్లు కాలేదు. కబుర్లు చెప్ప్తు డాబుసరిచేసిన వాళ్లేవరూ మహాపురుషుల జాబితాలో చేరలేదు. విజయానికి ఒకే వొక్క సూత్రం చెప్పమంటే, అది కష్టించి పనిచేయడమే.

9. నిరంతరం అభివృద్ధిని సాధించడం

మనం చేసే ప్రతిపనిలోను నిన్నటికంటె ఇవ్వాళ్ల అభివృద్ధి కన్పించాలి. మన జీవితం రోజురోజుకి మెరుగ్గా తయారుకావాలి. మనతో మనమే పోటీకి దిగాలి. మనలను మనమే జయిస్తుండాలి. ఈ సూత్రాన్ని పాటించే వ్యక్తిగాని, సంస్థగాని తప్పక విజయాన్ని సాధిస్తారు.

10. ప్రతివ్యక్తిని గౌరవించాలి

సమాజంలో ప్రతివ్యక్తి ముఖ్యమే. అందరినీ విలువతో చూడాలి. ప్రతి మనిషీ అమూల్యమైనవాడు అనుకోవాలి. అందరిపట్ల గౌరవం చూపాలి. ప్రతి వ్యక్తి జీవితం మనకేదో మంచి పాఠం నేర్పుతుంది. ఈ సూత్రాన్ని పాటిస్తే విజయం చేకూరుతుంది.

6. మాస్ మీడియూ యుగం

1492లో క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు. ఐదునెలల తర్వాతగాని ఆ సంగతి స్పెయిను రాజుకు తెలియలేదు. 1865లో అబ్రహాం లింకన్ని హత్యచేసారు. ఆవిషయం యూరపులో 12 రోజుల తర్వాత తెలిసింది. 1969లో నెయిల్ ఆర్మ్ స్టోంగ్ చంద్రునిమీద కాలుమోపాడు. ఆ సంఘటనను వెంటనే కోట్లకొలది జనం వాళ్ల యిడ్డల్లోనే టీవీలో చూచారు. ఇప్పడు