పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూర్చిన వ్యాసాలను ప్రచురించి ప్రజలను జాగృతం చేస్తాయి. మనతరపున మనం రోజూ పత్రికలు చదివి దేశంలోని పరిస్థితులను అర్థంచేసికొంటూండాలి.

పత్రికల్లో చాలభాగం ప్రకటనలు ఆక్రమించు కొంటాయి. అవి లేందే పత్రికలు ఆర్థికంగా నిలబడలేవు. కాని ఈ ప్రకటనలు వేయించేవాళ్లు పాఠకులను మభ్యపెట్టి మోసగిస్తారు.

కొందరు సంపన్నులు పత్రికలు నడుపుతుంటారు. వీళ్లు ఏదో వొక రాజకీయ పార్టీకి చెందివుంటారు. వీళ్లు వార్తలను తమ అభిప్రాయాలకు అనుకూలంగా మార్చి వేస్తుంటారు. పత్రికద్వారా సొంత అభిప్రాయాలను ప్రజల మీద రుద్దుతుంటారు. కనుక ఏ పత్రికను కూడ పూర్తిగా నమ్మకూడదు. ఇండియాలో వార్తలను సేకరించి పత్రికలకు అందజేసే సంస్థలు నాలున్నాయి. అవి పెస్ ట్రస్ట్, యునైటెడ్ న్యూస్, హిందుస్తాన్ సమాచార్, సమాచార భారతి,

ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి చదవడం రాదు. ఇండియాలో నిరక్షరాస్యులు ఇంకా యొక్కువ. కనుక మన దేశంలో పత్రికల ప్రభావం కొలదిగానే వుంటుంది.

పత్రికల తర్వాత చెప్పకో దగ్గరవి వార, మాస పత్రికలు. వీటినే మ్యాగజిన్లు అంటారు. పుస్తకాల్షాగ వుంటాయి. ఇవి దేశంలో జరిగే ఆయా సంఘటనల మీద వివరణలు అందిస్తాయి. ప్రజలు ఇష్టపడే అంశాల మీద వ్యాసాలు ప్రచురిస్తాయి. వీటిద్వారా జనానికి చైతన్యమూ ఆహ్లాదమూ కలిగిస్తాయి. బాలలు, స్త్రీలు, క్రీడలు, సాహిత్యం మొదలైన ప్రత్యేకాంశాలను పురస్కరించుకొని కూడ మ్యాగజిన్లు వుంటాయి.

ఇక, పుస్తకాల విషయానికి వస్తే, అన్ని దేశాల్లోను వీటికి గిరాకీ వుంది. నెస్కో వారి నియమాల ప్రకారం 49 పేజీలకు విధ భాషలనుండి అనువాదాలు కూడా విరివిగా వస్తున్నాయి. విజయవాడ