పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సహాయం చేయడానికి సిద్ధంగా వుండాలి. వారితో సులువుగా విభేదించకూడదు. వారి ప్రవర్తనలో తేలికగా తప్పలు పట్టకూడదు.

5. నమ్మదగినతనం వుండాలి. ఆడినమాట చెల్లించుకోవాలి. కుటుంబ సభ్యులు మనలను నమ్మగలిగివుండాలి. ఎదుట ఒకమాట చాటున ఇంకొక మాట చెప్పకూడదు. స్నేహితుల రహస్యాలను బట్టబయలు చేయకూడదు. ఆపదల్లో తప్పకుండ ఆదుకోవాలి.

6. కృతజ్ఞతాభావం వుండాలి. ఇతరులనుండి సహాయం పొందినపుడు వందనాలు చెప్పాలి. ఉపకారికి ప్రత్యుపకారం చేయాలి.

7. సహనం వుండాలి. మనం ఇతరులకు అనుకూలంగా మెలగాలి. పరులు మనకు అనుకూలంగా మెలగాలని పట్టుపట్టకూడదు. మన అభి ప్రాయాలతో ఏకీభవించని కుటుంబ సభ్యులపట్ల సహనం చూపాలి. ఎవరి నమ్మకాలు, మత విశ్వాసాలు వారి కుంటాయని అర్థం చేసికోవాలి. ఇతరుల అభిరుచులను, ప్రవర్తనా రీతులను గౌరవించాలి. స్నేహితుల లోపాలనూ పొరపాట్లనూ క్షమించాలి.

4. సఖ్యసంబంధాలను మెరుగుపరచుకోవడం ఎలా?

సఖ్యసంబంధాలను మెరుగు పరచుకోవడానికి ఈ క్రింది అంశాలు తోడ్పడతాయి.

1. ఒకరినొకరు నమ్మాలి. నమ్మకం లేందే ఏ యిద్దరి మధ్యా స్నేహమూ పొతూ కుదరవు. కనుక ఒకరిపట్ల వొకరు ఎప్పడూ నమ్మకాన్ని పెంచుకోవాలి.

2. ఒకరు చెప్పేది ఒకరు వినాలి. ఒకరి అభిప్రాయాలనూ కోరికలనూ ఒకరు అర్ధం చేసికోవాలి. గౌరవించాలి.

3. సమస్యలను చర్చించవచ్చు. కాని వివాదాలకు దిగకూడదు. చర్చలో మన అభిప్రాయాలను ఎదుటి వ్యక్తికి స్పష్టంగా తెలియజేస్తాం. వివాదంతో కోపతాపాలూ అనిష్టాలూ పెరుగుతాయి. మిత్రులు శత్రువులౌతారు. కనుక వివాదాన్ని మానుకోవాలి.