పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్ని నియమాలను పాటించాలి. వాటిని క్రింద పొందుపరుస్తున్నాం.

1. బాధ్యతాయుతంగా మెలగాలి. అందరికీ కొన్ని బాధ్యతలు వుంటాయి. ఎవరి విధులను వాళ్లు సక్రమంగాన నిర్వర్తించాలి. ఇంటిలో మనవంతు పని మనం చేయాలి. తల్లిదండ్రులు వృద్దులైనపుడు వారిని ఆదరంతో చూడాలి. తమ్ముళ్లు చెల్లెళ్లకు సహాయం చేయాలి. మన అవసరాల్లో స్నేహితుల నుండి సాయం పొందినట్లే వారి అవసరాల్లో వారికి సహాయం చేయాలి. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం.

2 ఓర్పు వుండాలి. ఇతరుల పొరపాట్లనూ అవకతవకలనూ క్షమించాలి. తొందరపడకూడదు. కోపతాపాలకు గురికాకూడదు. ఇంటిలో చిన్నపిల్లలు పొరపాట్లు చేసినప్పుడు ఓర్పు చూపించాలి. వృద్దులు రోగులు మొదలైనవారి పట్ల దురుసుగాగాక, జాలిగా మెలగాలి. అలాగే మిత్రుల అవకతవకలనూ వింత చేష్టలనూ సహించాలి. వారితో సులువుగా తగాదాకు దిగకూడదు.

3. మర్యాదగా మెలగాలి. కందెన పెట్టిన చక్రం మెత్తగా తిరుగుతుంది. తోడినరులతో మర్యాదగా మెలగడం ఈ కందెనలాంటిది. మర్యాదను మీరితే అపార్థాలూ గొడవలూ వచ్చిపడతాయి. కుటుంబంలో ఒకరి అవసరాలు ఒకరు గుర్తించి సహాయం చేస్తుండాలి. మర్యాదతో కూడిన మాటలు వాడుతుండాలి. ఇతరుల సొంత వస్తువులను వారి అనుమతి లేనిదే వాడకూడదు. స్నేహితులతో మృదువుగా మెలగాలి. మనసు నొప్పించేలాగ మాటలాడకూడదు. వారిని చులకన చేస్తూగాని, ఎగతాళి చేస్తూగాని అసలే మాటలాడకూడదు.

4. పెద్దమనసు కలిగివుండాలి. ఎప్పడూ ఉదాత్తంగాను, ఉన్నతంగాను ప్రవర్తించాలి. తోడివారికి సహాయం చేయడానికి సిద్ధంగా వుండాలి. వారి పొరపాట్లనూ అపరాధాలనూ క్షమిస్తుండాలి. పగతీర్చుకోవడానికి సిద్ధంగా వుండకూడదు. ఇంటిలోని ఆయా పనుల్లో మనవంతు సహాయం అందిస్తుండాలి. ఒకరితో వొకరు మనసు విప్పి మాటలాడాలి. పరస్పరం ప్రోత్సహించుకోవాలి. పొరపాట్లు జరిగినప్పడు ఒకరినొకరు త్వరగా క్షమించాలి. స్నేహితులకు