పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. హాస్యప్రీతి వండాలి. హాస్యప్రీతి కలవాణ్ణి జనం ఇష్టపడతారు. అతడు మనకు నచ్చని విషయం చెప్పినా అంగీకరిస్తాం. మనమీద మనమే జోకు వేసికోవడం గూడ మంచిది.

5. తోడి నరులందరినీ తారతమ్యం లేకుండ గౌరవంతో చూడాలి. చిన్నవారితో గూడ గౌరవప్రదంగా మెలగాలి. ఈలా చేస్తే ప్రజలు మనలను ఇష్టపడతారు. 6. ఇతరులను గూర్చి దురభిప్రాయాలూ అపోహలూ పెంచుకోకూడదు. అలా పెంచుకొంటే వారిమీద అనిష్టం పడుతుంది. సఖ్యం చెడుతుంది.

5. సఖ్యసంబంధాలను చెరిచే అంశాలు

కొన్ని అంశాలు సఖ్యసంబంధాలను నాశం చేస్తాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్తగా వుండాలి.

1. నా యిష్టప్రకారమే నేను పోతాను అనే మనస్తత్వం పనికిరాదు. మన యిష్టప్రకారం మనం పోతే ఎదుటివారికి బాధ, కష్టం కలిగిస్తాం.

2. విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు. పిల్లలు ఏదిబడితే అది చేస్తే తల్లిదండ్రులు చొప్పకోరు.

3. పొగత్రాగడం, మద్యపానం మొదలైన దురభ్యాసాలను మానుకోవాలి. వీటిని ఇంటిలోని పెద్దలు అంగీకరించరు.

4. ఇంటిలో మన వంతు పనులను మనం చేయాలి. లేకపోతే కుటుంబ సభ్యులు ఊరుకోరు.

5. సంప్రదాయాలకూ ఆచారాలకూ వ్యతిరేకంగా పోకూడదు. నా యిష్టం వచ్చిన డ్రైస్ వేసికొంటాను అంటే గొడవలు వస్తాయి.

6. తరాల అంతరాలు గొడవలు తెచ్చిపెడతాయి. పిల్లల ఫ్యాషన్లు, పద్దతులు పెద్దతరం వాళ్లకు నచ్చకపోవచ్చు.

7. విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టకూడదు. పేద కుటుంబాలు భరించలేవు.