పుట:NagaraSarwaswam.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

69


తాను సిగలో తురుముకొన్నది. అవి క్రమంగా వికసించడమే కాక రేకలను రాల్చే దశకుచేరుకొంటున్నాయి. ప్రియుడు వస్తాడన్న ఊహతో మనసులోని కోరికలు రెపరెపలాడగా తనూతాపం పెరిగింది. ఆ ప్రియుడు రాలేదు ఆమె తన నితంబాన్ని చేతితోనొక్కుకొని నిట్టూర్చింది. శయ్యపై నిద్రిద్దామని ఇటునటు పొరలాడింది. తాపం పెరుగుతోంది ప్రియుడు రాలేదన్న బాధవల్ల కన్నులలో నీరు చిప్పిలుతోంది.

ఈస్థితిలో ప్రియుడు వచ్చేడు. తనకై తపించే ప్రియురాలి యీ తపన ఆతనికంటబడ్డది. ఆతని పెదవులపై దరహసం. మనసులో ఉత్సాహం వెల్లివిరిశాయి. అతడామెను కౌగలించుకొన్నాడు. ఆమె అలుకతో-"ఇదిగో! ఇప్పుడేవస్తానని ఇంతఆలస్యంగానా రావడం? అన్నది. ఈమాటకూడ ఆమెలోని తాపాన్నే వ్యక్తంచేసింది.

అతడు-ఆలస్యమైనది అపరాధిని దండించు. బాహువులతో బంధనం, బొడ్డుమల్లెలు తురుముకొన్న జడతోదండనం-నేనుసిద్ధంగా ఉన్నాను-అన్నాడు. ఆమెనవ్వింది. అతనిఒడిలోనికి ఒరిగిపోయింది.

ఇదిగో! ఇట్టిచేష్ట 'తపనం' అనబడుతుంది.

15. లలితము :- పరమసుకుమారముగా కన్నులను, కను బొమలను, చేతులను కదల్చుట 'లలితము' అనబడుతుంది. ప్రియురాలి సర్వశరీరము ప్రియునిలోని శృంగారరసాన్ని తరంగితం చేసేదై వుంటుంది. ఆప్రియురాలే పరమసుకుమారంగా తన కాళ్ళు చేతులను కదలిస్తూ కనుబొమలను సుందరంగా పైకెత్తి క్రీగంట చూడడం జరిగితే ఆ చేష్టకు ప్రియునిలోనికామం మరొకమెట్టు పైకి ఎక్కుతుంది.

"ప్రియురాలు ఇంటిలో ఏదోపని చేస్తోంది. ఆమెశరీరం మెఱుపుదీవలా మెఱుస్తోంది. పొడవైనజడ పిరుదలపై నాట్యం చేస్తోంది. ప్రియునకామెను ముద్దాడవలెననిపించింది. అతడామెకు వెనుకగ వెళ్లి