పుట:NagaraSarwaswam.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68


చేతులలో ఆమె పరవశ అయివున్నది. ఆమె చేతులకు మంచిముత్యములు పొదగబడిన బంగారుగాజులున్నాయి. అవి ఆమెయొక్క కోమల హస్తాలకు ఎంతో అందాన్ని చేకూర్చాయి. అవి ప్రియునిదృష్టిని ఆకర్శించాయి. అతడామె కంకణాలను పరిశీలిస్తూ-ఈ ముక్తాఫలాలు చాలా ఉత్తమమైనవి."-అన్నాడు. ముక్తాఫలం అంటే మంచిముత్యమే. అవి సముద్రంలో ముత్తెపుచిప్పలలో దొరుకుతాయి. కాని ఈ విషయం ఆముద్దరాలికి తెలియదు. ముక్తాఫలం అంటే ఆమె ఏదోపండు అని అనుకొన్నది. అవి ఏవో చెట్లను పండుతాయని, ఆఫలాలే తనచేతి గాజులలో మెరుస్తున్నాయని అనుకొంటోంది ఆమె.

అందుచే వెంటనే ఆమె తనప్రియునితో-ముక్తాఫలాలు పండే చెట్లు ఎక్కడవుంటాయి? నేనెప్పుడూ ఆచెట్లను చూడనేలేదు-అన్నది. ఆమెయొక్క యీ అమాయికత అతని ఉత్సాహానికి దీప్తినికలిగించింది. అతడునవ్వుతూ ఆమెను అక్కునజేర్చికొన్నాడు. ఇదిగో! ఇట్టి అమాయికతా లక్షణమునకే మౌగ్ధ్యము అనిపేరు.

14. తపనము :- ప్రియుడు అర్ధరాత్రమువరకు రాకపోయినచో ప్రియురాలు మిక్కిలిగా తాపానికి లోనుకావడం 'తపనము' అనబడుతుంది. ఈసమయంలో స్త్రీలు ఎక్కువగా నిట్టూర్చుట, కన్నీరుపెట్టుకొనుట, తమ దురదృష్టాన్ని నిందించుకొనుటద్వారా తమ తాపాన్ని వ్యక్తపరుస్తారు. తనకై యింతగా తపించే ప్రియురాలిని చూచేసరికి ప్రియునకు కలిగే ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది. ప్రియునితో శృంగారరసానికి యీ విధంగా దోహదంచేసే చేష్టకే 'తపనము' అనిపేరు.

అర్ధరాత్రం కావస్తోంది. వచ్చెదనన్న ప్రియుడు రాలేదు. తానేమో అలంకరించుకొని కూర్చున్నది. శయ్యాకారం నుసజ్జతంగా ఉన్నది. వెలిగించిన అగురువత్తులుకూడ మేమింక నిరీక్షించలేమన్నట్లు నివురు గక్కి చల్లారిపోయాయి. సాయంవేళ అరవిరసిన బొడ్డుమల్లెలను