పుట:NagaraSarwaswam.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67


హలు మొదలుతూనేవున్నాయి. ఈస్థితిలో ఒకసారి యిట్టిపరమశివగుణ గానం విని ఆమె ఒడలు విరచుకొన్నది. ఆవులించినది. ఆచేష్ట నెరజాణలైన ఆమె చెలులకంటబడ్డది. వారునవ్వేరు. పార్వతిమొగం సిగ్గుతో ఎఱ్ఱతామరమొగ్గ అయినది." ఇదుగో! ఇట్టిచేష్టకే మోట్టాయితము అని పేరు.

12. కుట్టమిత :- తాను మిక్కిలిగా వలచిన ప్రియుడు ప్రేమతో తన్నూ సమీపించి తనస్తనాలను, కేశాలను గ్రహించి ఆలింగనం చేసికొన్నపుడు కలిగిన అధికానందంలో యువతి అప్పుడప్పుడు బాధను వ్యక్తపరచడం అబ్బ! అయ్యో! అనడం జరుగుతుంది. ప్రియురాలి నోటినుండి వచ్చే యీ మాటలవలన ప్రియుని యందలి శృంగారభావం ఉత్తేజితం అవుతుంది. ఇట్టిదైన దుఃఖావిష్కరణ చేష్టయే 'కుట్టమితము' అనబడుతుంది.

'అబ్బా! చేతులతో అంతగట్టిగా నొక్కితే సహించుకొన గలనా? అంతమోటదనమైతే ఎలా? అనేమాటలు భార్యపలుకగా పురుషుడు వినడం, విని అధికమైన ఉత్సాహాన్ని పొందడం సాధారణంగా జరుగుతూనే వుంటుంది.

ఇదుగో! వనితలొనరించే యిట్టిచేష్టయే 'కుట్టమితము' అనబడుతుంది.

13. మౌగ్ధ్యము :- ఇప్పుడిప్పుడే యౌవనావస్థలో అడుగుపెట్టిన వనితను 'ముగ్ధ' అంటారు. ఆమె మన్మథవ్యాపారం ఎరుగనిదై అమాయికయై వుంటుంది. ఆమెలో లోకజ్ఞత తక్కువగా వుంటుంది. లజ్జ మిక్కుటంగా వుంటుంది. ఇట్టివనితయొక్క స్వభావమునకే 'మౌగ్ధ్యము' అనిపేరు. అమాయికములైన ఆమెపనులు మాటలుకూడ భర్త్వమానసంలోని శృంగారభావానికి చక్కిలిగింతలు పెట్టజాలినవై వుంటాయి.

"ఒక ముద్ధరాలు ప్రియునియొడిలో తలనిడుకొని శయనించినది. సిగ్గువల్ల ఆమెకు ఆలా శయనించకుండా వుండాలని వున్నా భర్త