పుట:NagaraSarwaswam.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ఈ చేష్ట వివాహానికి పూర్వదశయందు లేదా విరహావస్థ యందు పతియందనురక్తులైన స్త్రీలలో గోచరిస్తుంది. అనగా-తల్లి దండ్రులు తమకన్యకు తగినవరుడుగా ఎవరినో తీసికొని వచ్చివారు, ఆ వరుడువచ్చి యీ పెండ్లికూతురును చూచేడు; వెళ్లేడు. వివాహం నిర్ధారణ అయినటులేతోస్తోంది. ఇక్కడ ఈపెండ్లికూతురుకూడ ఆ వరుని తిలకించి వున్నదికదా! అతడు సుందరుడు, ఈమె కంటికి నచ్చేడు. ఇంటిలో ఈ వివాహాన్ని గూర్చి తల్లి దండ్రి మాటాడుకొంటున్నారు. వారు వరునిగూర్చి-అతనికి సంగీతంలోకూడ మంచిప్రవేశం వున్నదట! ఎంతో బాగా పాడగలడట! ఎంతోవినయం కలవాడు. వాళ్లకు తోటలు, దొడ్లు ఉన్నాయి. ఇంతమంచి సంబంధం కుదరడం అమ్మాయి అదృష్టం-ఇత్యాదిగా ఆ వరుని గుణగుణాలను సంపదనుగూర్చి చెప్పుకొనే సమయంలో ఆమెచెవులు దోరపెట్టుకొని వింటుంది. వినుటయేకాక అత్యధికానురాగంలో ఒడలు విరుచుకొంటుంది. ఆవులిస్తుంది. ఈ చేష్ట విరహిణి అయిన యువతికూడ ప్రియకథాశ్రవణవేళ ప్రదర్శిస్తుంది.

హిమవంతుని ఇంటిలో పార్వతిపెరుగుతుంది. పార్వతికి తగిన వరుడు పరమశివుడే అన్నవిషయం నిశ్చయం అయింది. అంతా ఆ పరమశివునిగూర్చియే మాటాడుకొంటున్నారు. ఆశివునిపాదాలకు మహర్షులుకూడ తలలువంచి నమస్కరిస్తారనేవారు కొందరు. ఆయనకు తెలియని విషయమేలేదు, ఆయన సర్వజ్ఞుడ అని కొందరు, అంతేకాదు, ఆయన మృత్యువునికూడ జయించేడట, ఇంతవరకు ఆయనకు పెండ్లికాలేదు, అనికొందరు హిమవంతుని కుటుంబంలోనివారు చెప్పుకొంటున్నారు. పార్వతీదేవి ఆమాటలను కుతూహలంతో వింటోంది. వినాలనివున్నా లజ్జకారణంగా విననటులే వినాలన్న ఆసక్తిలేనటులే చరిస్తోంది. కాని మనసులోనికోరిక ఆమెను ఆమాటలు వినబడేచోటికి లాగుతూనే వున్నది. వెళ్లివిన్నపుడల్లా ఆమెమానసంలో ఏవో మధురములైన ఊ