పుట:NagaraSarwaswam.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41

నడిమివ్రేలి దిగువరేఖ సప్తమికి, మధ్యమరేఖ అష్టమికి, పై రేఖ నవమికి సంకేతాలై యున్నాయి. ఆ తరువాత చూపుడువ్రేలియొక్క పై రేఖనుండి గణించాలి.

చూపుడువ్రేలియొక్క పై రేఖ దశమికి, మధ్యరేఖ ఏకాదశికి, దిగువరేఖ ద్వాదశికి సంకేతాలు. పిమ్మట బొటనవ్రేలి దిగువరేఖ నుండి లెక్కించాలి.

బొటనవ్రేలియొక్క దిగువరేఖ త్రయోదశి, మధ్యరేఖ చతుర్ధశికి, పై రేఖ పూర్ణిమకు లేక అమావాస్యకు (ఆ బొటన వ్రేలు ఎడమచేతిదైనపుడు పూర్ణిమకు, కుడిచేతిదైనపుడు అమావాస్యకు) సంకేతాలు.

ఇలా వున్న యీ సంకేతాలలో ప్రియురాలు స్పృశించిన సంకేతాన్ని గమనించి పురుషుడు ఫలానా తిధినాడు రమ్మంటూ వున్నదని గ్రహించి—వెనుక భాషాసంకేతాలలో జాములకు చెప్పిన "శంఖ-మహాశంఖాది సంకేతాలతో జామునుకూడ ఆమె సూచిస్తే- ఆ తిధినాడు-ఆ జామున-ఆమె సంకేతంద్వారా తెలిపిన దిశయందు ఆమెను కలిసికొనాలి.

ఈ సంకేతాలను పురుషులు, స్త్రీలు ఇద్దరూకూడ వుపయోగించ వచ్చును. వీనిద్వారా నాగరజనం యొక్క వర్తనం ఇతరులు తెలిసికొనడానికి వీలులేనిదై-దుర్భేద్యమై-నిరపాయమై-సుఖదమై వుంటుంది. భాషా సంకేతాలు మాట వినబడదగినంత దూరంలో వున్నప్పుడు వినియోగింపబడతాయి. ఈ అంగ సంకేతాలు ప్రియుడు లేక ప్రియురాలు ఒకరినొకరు చూడదగినంత దూరంలో వున్నప్పుడు వినియోస్తాయి.


పోటలీ సంకేతములు

ఈ లోకంలో కామినీ కాముకులు స్వచ్చా విహారాలు అసంఖ్యాక విధానాలలో సాగుతూంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక విధమైన సంకేతాన్ని వుపయోగించడానికి వీలు కుదురుతుంది. అందుచే