పుట:NagaraSarwaswam.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35


టకు రావద్దని" సూచించడానికి 'ప్రాకారము' (గోడ) సంకేతముగా వినియోగింపబడుతుంది.

ఇది ముద్రారూపంలోకూడ చూపబడుతుంది. అనగా ఏదేవాలయ ప్రాంగణములోనో ప్రియుడు తన వంకకుచూచి, తనతో కలియవలెనన్న కోరికను గూఢంగా చేష్టల ద్వారా వ్యక్తపరిస్తే-తగినవెసులుబాటులేదని తలంచిన కామిని ప్రాకారముద్రను (రెండు చేతులవ్రేళ్ళను చాచి ఒకదానితో ఒకటి కలిపి గోడయొక్క ఆకారమును కల్పించుట) ప్రదర్శిస్తే ఆ కాముకుడు-ఇది తగిన సమయంకాదని, అడ్డంకులున్నాయని గుర్తించాలి.

ఇక-'నీవు రావచ్చును, నన్ను కలియవచ్చును, నీకు అడ్డములేదు అని సూచించడానికి 'అంకుశమును' (ముద్రారూపంలో కూడ) సంకేతముగా ఉపయోగిస్తారు.

చేతివ్రేళ్ళలో నడిమి వ్రేలినిమాత్రం చాచి-దానికి ఒకప్రక్కగా ఉన్న చూపుడు వ్రేలిని సగానికి మడచి ఉంచితే అది అంకుశముద్ర అనబడుతుంది.[1]

ఇట్టిదైన అంకుశముద్రాసంకేతాన్ని నాగర జనం పదుగురిలో ఉన్నప్పుడుకూడ ప్రియుని ఆహ్వానించడానికి వినియోగిస్తారు.

తన్ను కలియదగిన సమయం రాత్రివేళ అయితే దానిని తెలుపుటకు 'ఛన్నచంద్రుడు' (మబ్బుచాటు చంద్రుడు) అలాకాక పగటి భాగమే అయితే 'బాగా ప్రకాశించే సూర్యుడు'-సంకేతాలుగా వినియోగింపబడతారు.

ఈ సంకేతాలు చేతివ్రేళ్ళతో అభినయించే ముద్రలద్వారాకాని చిత్రాలద్వారాకాని ఉపయోగింపబడతాయి.

ఇక తన్ను కలియవలసిన సమయం జాములలో వచ్చినపుడు వానికి వేరే సంకేతాలు ఉన్నాయి. సూర్యోదయం


  1. ఋజ్వాం చ మధ్యమాల కృత్వా తన్మధ్యే సర్వమూలతః
    తర్జనీం కించి దాకుంచే త్సాముద్రాంకుశ సంజ్ఞితా!