పుట:NagaraSarwaswam.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34


మాలతీ సౌందర్యమే సౌందర్యం. వికసించిన యీ మాలతీ పుష్పాన్ని చూస్తూంటే నాకు నిద్ర, ఆహారము అక్కరలేదు. మాలతీ పుష్పాన్ని గుండెపై ధరించి యేకాంతముగా దాని సౌందర్యాన్ని ఆలోకించే భాగ్యమే లభిస్తే నాకు లోకములో పనిలేదు. నేను సర్వాన్ని మరచి మాలతీ సౌందర్యాన్ని ఆరాధిస్తాను” - ఇత్యాదిగా ఈ సంకేతాలు వినియోగింప బడుతూంటాయి.

పెద్ద వర్తకుని కూతురు విషయంలో తామరపూవు, మంత్రి కూతురు విషయములో నల్లకలువపూవు సంకేతములై వున్నాయి. కాముకుడైన పురుషునకు తుమ్మెదయున్ను, కామినియైన యువతి 'మామిడి పూలగుత్తి' సంకేతములై ఉన్నాయి.

"ఉద్యాన వనంలోని దిగుడుబావిలో నల్లకలువపూవు ప్రక్క ఒక తామరపూవు వికసించి వుండడం నిన్నచూచేను. అవి జంటగా ఒక దానినొకటి ఒరసుకొని కదలి ఆడుతూంటే గండుతుమ్మెద ఎక్కడ నుండి వచ్చినదోకాని ఒకసారి కలువమీద, ఒకసారి తామరపూవు మీదవ్రాలి తేనె త్రాగసాగింది, యీదృశ్యం నిన్నచూచేను. ఆ గండు తుమ్మెద వ్రాలినంతనే ఆ తామరపూవు కలువపూవు ఎంతో అందంగా కదులుతూ దానికి తమ హృదయంమీద చోటిచ్చాయి". ఇత్యాదిగా మంత్రి కుమారికయొక్క విహారాన్ని పుద్దేశించి యీసంకేతాలు వుపయోగింపబడతాయి.

"వికసించిన యీ చూతమంజరి (మామిడిపూవులగుత్తి) మీద గండుతుమ్మెద వ్రాలినపుడే యీగుత్తి తుమ్మెదకై ఎదురుచూస్తోంది ఇత్యాదిగా కామినులైన స్త్రీలనుద్దేశించి చూతమంజరీ సంకేతము. కాముకులైన పురుషులనుద్దేశించి తుమ్మెదయొక్క సంకేతము వుపయోగింపబడతాయి.

ఒక కాముకు డొక వనితను కలియగోరినపుడు ఆతనితోడి కలయిక ఆమెకిష్టమైనప్పటికి -“తగిన సమయంకాదని, నీవు నన్ను కలియు