పుట:NagaraSarwaswam.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36


మొదలు తిరుగ సూర్యోదయం అయ్యేవరకు ఉన్నకాలం 24 గంటలు కదా! ఈ కాలాన్నే ఎనిమిది జాములుగా విడదీస్తారు. అందుచే జాముఅంటే మూడు గంటలకాలం అవుతుంది.

ఈ జాములలో మొదటి జామునకు- 'శంఖము', రెండవ జామునకు-'మహాశంఖము', మూడవ జామునకు-'పద్మము', నాల్గవ జామునకు-'మహాపద్మము', ఐదవ జామునకు-'రాముడు' సంకేతాలుగా వినియోగింపబడతాయి.

ఆరవ జామునకు—'విరామశబ్దము', ఏడవ జామునకు—'ప్రవరశబ్దము', ఎనిమిదవ జామునకు—'ప్రత్యూష శబ్దము' సంకేతాలుగా నాగరజనం ఉపయోగిస్తారు.

"ఓతుమ్మెదా! విరామ సమయంలో (రాత్రి 9-00గం. దాటిన మీదట 12 గం.ల వరకు) నల్ల కలువపూవులోని మాధుర్యాలను (మంత్రికుమారికయొక్క సొగసులను) అనుభవిస్తూ-ప్రవర సమయాన్ని (రాత్రి 12 గం. మొదలు 3 గం. వరకు) కూడ అక్కడే గడపి ప్రత్యూష సమయానికి (తెల్లవారు జాము 3 గంటలు దాటిన మీదట సూర్యుడుదయించేవరకు ఉన్నకాలం) మాలతీ కుసుమం మీదకు (రాజకుమారి) వచ్చి వ్రాలిన నీ రసికత కొనియాడదగినది"-ఇత్యాదిగా ఈ సంకేతాలు వినియోగింపబడతాయి.


అంగసంకేతములు

వెనుక ప్రకరణంలో భాషాసంకేతములు వివరింపబడ్డాయి. అవి యెంత సాంకేతికంగాఉన్నా వానిని ఉపయోగించడానికి కొంతవీలుచిక్కితేకాని కుదురదు. ఏమంటే-సందర్భం ఏమీ లేకుండా-ఓతుమ్మెదా! నీ రాకకై ఈ మాలతీ పుష్పం ఎదురుచూస్తోంది.'- అనడం కుదరదు కదా! అదీకాక కేవలం ఆ భాషా సంకేతాలవల్ల కొంత పరిమితమైన