పుట:NagaraSarwaswam.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33


చ్చును. కాని ఒకదుష్టుడామె పొందుగోరి ఉచ్చులు పన్నవచ్చునుకదా ఆ విషయం ఆమెకు ఇష్టంకాదు. ఆలాఅని భర్తతో చెబితే పెద్దరగడ అవుతుంది. అందుచే ఆమె తనకు ఇష్టంకానిదైనప్పటికి ఇట్టి విషయాలను గూఢంగా దాచే స్వభావంకలదై వుంటుంది. అందుచే దుష్టునకు కూడ సంకేతం అవసరం ఆయింది.

"చెలీ! చెరువుగట్టుమీద ఎప్పుడు చూచినా ఏవో నల్లని పువ్వులే వుంటాయి. ఆ పువ్వులంటే నాకు మిక్కిలి అసహ్యము. కాని ఎప్పుడు చెరువుకువెళ్ళినా అవి కంటబడుతూనేవున్నాయి. ఇత్యాదిగా ఈ సంకేతం. వినియోగింపబడుతుంది.

సామంత రాజుపుత్రుని విషయంలో 'సరస్సు' సంకేతంగా చెప్పబడ్డది.

“నీవు మేఘచ్చాయనుచూస్తే ఆనందిస్తావు. నాకు సరోవరాన్ని తిలకించాలని ఉంటుంది"-ఇత్యాదిగా పుడమినేలే రాజును ప్రేమించిన వనితతో సామంత రాజకుమారుని పొందుకై తహతహపడే తరుణి సాంకేతికంగా మాటాడుకొనడానికి ఈ సంకేతం వినియోగపడుతుంది.

ఇక స్త్రీల విషయంలో పుష్పము సంకేతముగా వినియోగింప బడుతుందని వెనుక చెప్పబడ్డది. ఏజాతి స్త్రీ విషయంలో ఏపుష్పాన్ని సంకేతంగా ఉపయోగించాలి. అన్న విషయము వివరింపబడుతోంది.

బ్రాహ్మణ స్త్రీ విషయంలో కుంద పుష్పము. (మొల్లఫూవు) రాజపుత్రిక విషయంలో మాలతీపుష్పము, వైశ్వవనితా విషయంలో మల్లెపూవు, శూద్రవనితకు తెల్లకలువపూవు సంకేతములై వున్నాయి.

కాముకులైన నాగరక జనం ఈ సంకేతాలతో గూఢంగా తమ మనోభావాన్ని వ్యక్తంచేస్తూ వుంటారు. తాను వలచిన ప్రియురాలు ఏ దేవాలయముసకో, చెఱువుకో, ఉద్యానవనమునకో పదిమందితో కలసివచ్చినపుడు, వారందరి యెదుట తాను వెల్లడిగా మాటాడకూడదు గనుక-తన ప్రక్కనున్న స్నేహితునితో-"పూవు లన్నిటిలోను