పుట:NagaraSarwaswam.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32


నేనన్నాను. ఈసంకేతానికి శిష్యుడు అలవాటుపడ్డవాడే అయినందున "నేనుకోరే పొగచుట్టను తెచ్చిపెట్టేడు. చదువుకొన్న పండితుడను. అందరియెదుట, చుట్టతెమ్మని ఎలాచెప్పను. అందుచే అలాచెప్పేను. అని నవ్వేడు.

కాగా లోకంలో సంకేతాలు ఈ తీరునలో ఉంటాయని తెలిసి కొనాలేకాని నియతంగా అవేసంకేతాలు వుంటాయని తలంపకూడదు.

రాజపుత్రుని విషయం 'విదియ చంద్రుడు' సంకేతంగా వాడబడతాడు. పుడమినేలే ప్రభువును నీడనిచ్చే పెద్ద మేఘము సంకేతమై యున్నది.

"ఏమే! చెలీ! నిన్న చెఱువుకు వెళ్లేను. అక్కడ పొదరింట కూరుచున్నాను. ఇంతలో ఒక పరమ సుందరమైన మేఘం ఆకాశం మీద కనుపించింది. ఆ మేఘంయొక్క నీడ చెఱువుమీద, పొదరింట మీద, నామీదకూడ పడ్డది. ఆ మేఘచ్చాయలో ఉన్న సమయం తక్కువే అయినా నా కేమిటో విలక్షణమైన ఆనందం కలిగింది. ఆ మేఘాన్ని తలచుకొంటే ఇప్పుడుకూడ మనస్సు పరవశం అయిపోతూన్నది మళ్ళా ఆ మేఘచ్చాయలో ఆనందించాలని వున్నది."- ఇత్యాదిగా ప్రభువుతో తాను అనుభవించిన అనందము, తిరుగ అనుభవించాలన్న కోరిక 'మేఘచ్ఛాయను' అడ్డంగా పెట్టుకొని నెరజాణ అయిన నాగరిక కామిని జంకుబౌంకులు లేకుండా వల్లడిస్తుంది.

దుష్టమైన వంశంలో పుట్టిననాని విషయంలో నల్లని పుష్పము సంకేతముగా వుపయోగింపబడుతుంది.

దుష్కులంలో పుట్టినవానిని నాగరకవనిత కామించదుకచా! వాని విషయంలో ఒక సంకేతం ఎందుకు? అనిపిస్తుంది. కానీ దాని అవసరంకూడ వున్నది.

సాధారణంగా పురుషుడు తన భార్యను ఎవడో కామిస్తున్నాడని తెలిసినప్పుడు వానినెత్తురు కళ్ళజూచే వరకు శాంతించలేని తత్త్వంకల వాడైవుంటాడు. ఒక నాగరక యువతి ఒక దుష్టుని ప్రేమించకపోవ