పుట:NagaraSarwaswam.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21


అలంకరణము - ఆవశ్యకత

కామం చాలా సున్నితమైన గుణం. అది మనస్సుయొక్కలోపలి పొరలలో జనించేదై ఉంటుంది. పురుషుడుకాని, స్త్రీకాని ఎవరైనా కామించి వారి అనురాగాన్ని సంపాదించదలచినపుడు - తమచే ప్రేమింపబడే ఆజనంయొక్క మనస్సులో తమ విషయమై ఒక సుముఖత ఏర్పడేలా వర్తించవలసిన వారవుతారు. ఆఎదిరిమనస్సులోని సూక్ష్మ సుక్ష్మభావాలనుకూడ గుర్తించి వానికి అనుకూలమైన వేషభాషాదికాన్ని అలవరచుకొనవలసి వుంటుంది.

అసహ్యము-మలినము అయిన వేషముకలవాని హృదయంలో అమృతంవలె స్వచ్ఛమైన ప్రేమ నెలకొనివున్నా వానిప్రేమ తిరస్కరింపబడుతుందేకాని ఫలించదు. అందుచే స్వచ్ఛమైన వేషధారణం అందరకూ మిక్కిలి అవసరం.

అందులోనూ నాగరకులై మిక్కిలి ప్రజ్ఞా విశేషాన్ని గడించి ఏ పని అయినాసరే సుందరంగా కళాత్మకంగా ఆచరించే స్వభావంకలవారై-ధనవంతులై-సౌందర్యం కలవారై = మదవతులైన పడతుల అనురాగాన్ని సంపాదించి, ఆఅలభ్య సుందరీసమ్యోగ పారవశ్యంలో సుఖిద్దామని వువ్విళ్ళూరేవారు-తమ శరీరాలంకరణ విధానంలో మిక్కిలి యెక్కువ ఆసక్తి చూపవలసి వుంటుంది. అలాకాక శరీరాలంకరణలో స్వచ్చవేషధారణలో అశ్రద్ధ చూపితే అట్టి నాగరకులైన యువతులు వారిని కన్నెత్తికూడ చూడరు.

నాగరకులైన స్త్రీ పురుషులు కాలాను గుణములైన స్వచ్ఛ వస్త్రాలను ధరించాలి. వేసవియందు తాపం ఎక్కువగా వుంటుంది, అందుచే సన్నని పలుచని దుస్తులు, ధరించే వానికేకాక చూచేవారికి కూడ తృప్తిని కలిగిస్తాయి. వర్ష ర్తువులో పరిమితములైన దుస్తులను ధరించడం మంచిది. చలికాలంలో ధరించే దుస్తులు కొంత ముదుకగా