పుట:NagaraSarwaswam.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22


వున్నప్పటికి బాధలేదు. కాని ఏ కాలంలో ధరించే దుస్తులైనాసరే స్వచ్చంగా వుదుక బడ్డవై వుండాలి.

కేవలం ఇలాదుస్తులతో మాత్రమేకాక నాగరకులు నానారత్నాలతో నిండిన సముచితమైన ఆభరణ సముదాయముతోడను, మంచి సువాసనలు వెదజల్లే సుందర పుష్పాలతోడను కూడ తమ్ముతాము అలంకరించుకొనడం అవసరం. యీ ఆభరణాలు, పూలమాలలు శరీర సౌందర్యాన్ని ఇనుమడింప జేసేవై పుంటాయి. రత్నహారాలచే కంఠము పుష్పమాలలచే కేశపాశము, కంకణాలచే కరయుగ్మము అందాలు చింది ఎదిరిచూపులను మనస్సును ఆకర్షిస్తాయి.

అత్తరు, పన్నీరు మొదలగు పరిమళ ద్రవ్యాలను సముచితముగా వుపయోగించడం కూడ నాగరకులకు అవసరం. ఎల్లపుడు ఏదో ఒక మంచి సువాసనా ద్రవ్యం అలచుకొని నలుగురులోనికి ఎవడైనావస్తే ఆ సువాసనాద్రవ్యం కారణంగా అక్కడవున్న జనంయొక్క చూపులు అనుకోకుండా అతని వంకకు మళ్ళుతాయి. "ఎక్కడిదయ్యా! ఈసువాసన!"అని ఓహో! ఇతడా! అందుకే యీ ఘుమఘుమ!” అని అంటూ వారాతనిని నాదరంగా ఆహ్వానిస్తారు.

అందుచే అత్తరు, పన్నీరు, కర్పూర తాంబూలము-వీనిని నాగరకులు తప్పక సేవించవలసి వుంటుంది. ఇక శరీరంయొక్క చర్మంమీద విశేషించి మొగంమీద పూసుకొనే అంగరాగాలు (పౌడరు, షెదవి రంగు మొదలుగునవి) విషయంలోకూడ నాగరకులు అశ్రద్ధ చూపకూడదు. మేలైన అంగరాగద్రవ్యాలను ఎంచి జాగ్రత్తచేసి తగినట్లుగా వానిని వుపయోగించడంవల్ల చర్మసౌందర్యము, ముఖసౌందర్యము ఇనుమడిస్తాయి. యీ అంగరాగద్రవ్యాలను వుపయోగించికపోతే ముఖమందు శ్రమలక్షణమైన జిడ్డుతోకూడిన చెమట ఏర్పడివున్న సౌందర్యానికికూడ లోపం కలిగిస్తుంది. యీ కారణంచే నాగరకజనం శరీరాలంకారానికై ఉపయోగించే సర్వవస్తువులను నిత్యము ఉపయోగిస్తూండాలి. అలా కానినాడు వారికి నాగరకులతో గౌరవం లభించదు.