పుట:NagaraSarwaswam.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

9. వేష్టితకము :- వేష్టనము అనగా చుట్టుట. తుమ్మెదలవలె నల్లగాఉండి, సువాసనలు విరజిమ్ము పూవులతో అలంకరింపబడిన భార్యయొక్క జడను చేతికి చుట్టుకొని లాగుట లేదా జుట్టులోని ఒక పాయను మాత్రము తనవ్రేలికి చుట్టి లాగుట- 'వేష్టితకము' అనబడుతుంది.

10. కృతగ్రంథ^ :- గ్రంథి అనగా ముడి. భర్త భార్యయొక్క చేతివ్రేళ్ళ సందులనుండి తన చేతివ్రేళ్ళను పోవనిచ్చి ఆమెచేతివ్రేళ్ళతో తన చేతివ్రేళ్ళను ముడివైచినట్లుంచి నొక్కుటజరిగినచో - ఆస్థితి 'కృతగ్రంథి' అనబడుతుంది. ఆలుమగల చేతివ్రేళ్ళు ముడివేయబడినట్లుండుటచే దీనికీపేరు వచ్చినది.

11. సమాకృష్టి :- ఆకర్షణ మనగా లాగుట. భార్యను గూడి రమించుచున్న భర్త ఆమెయొక్క చనుమొనను లేదా మెడమీది పలుచని చర్మమును తన చూపుడువ్రేలితోడను, బొటనవ్రేలితోడను (రెండువ్రేళ్ళతో మాత్రమే గ్రహించి లాగుట జరిగినచో అది 'సమాకృష్టి' అనబడుతుంది.

ఇట్లున్న ఈ తాడనభేదములయందు ఏడవదైన సమాక్రమము మొదలు పదునొకండవదైన సమాకృష్టివరకు చెప్పబడిన తాడనము లైదును నిజమునకు తాడనములు (కొట్టుటలు)కావు. అయినను వీనిచే భార్యయొక్క శరీరము తాడనమునందువలెనే నొచ్చుట జరుగును. అందుచే ఇవి ఇందు చేర్చబడ్డాయి. ఈ తాడనములన్నియు ఉచితవేళ ఉచితరీతిని ఆచరింపబడినప్పుడు భార్యాభర్తల సంభోగసౌఖ్యాన్ని పెంపొందిస్తాయి.

వీనివలన భార్యకు కొంచెంభాధకలిగినా తన శరీరావయవాలతో ఈవిధంగా భర్త తాడనపూర్వకంగా ఆడుకొనడం ఆమెకు ఆనందాన్నే కలిగిస్తుంది. అయినా ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి బదులు నొప్పినే అభినయిస్తూ 'ఇస్-అమ్మ-అబ్బ' మొదలగు