పుట:NagaraSarwaswam.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

131


మునందు కామాగ్ని జ్వలించునట్లు ఇచ్చట, అచ్చట అనక అంతట మర్దించుట, కొట్టుట జరిగినచో ఆతాడనము 'ఆదీపితము' అనబడుతుంది. కామము సర్వత్ర దీప్తమగుటకై చేయబడు తాడనమగుటచే దీనికీ పేరు వచ్చినది.

5. స్పృష్టకము : భార్యయొక్క శరీరమునందు భర్త కేవలము తన అరచేతితో అల్పముగా తాడించినచో అది 'స్పృష్టకము' అనబడుతుంది. స్పృష్టశబ్దమునకు స్పృశింపబడినదని అర్థము. ఈ తాడనము స్పర్శాప్రధానముగా ఆచరింపబడుతుంది. అందుచేదీనికి 'స్పృష్టకము' అనుపేరువచ్చినది.

6. కంపితకము : కంపనమనగా వడకుట. భార్యాభర్తలు కలిసి రమించుచుండగా భర్త ఒకానొక ఉత్కటావేశమునకు లోనై - ఆ అధికావేశము కారణముగా వడకుచున్న చేయికలవాడై - అట్లు వడకుచున్న చేతితో భార్యాశరీరమునం దచ్చట తాడించుట జరిగినను - ఆ తాడనము 'కంపితకము' అనబడుతుంది. భార్య తన సౌందర్యం ద్వారా భర్తయందు జనించిన అధికావేశాన్ని ఈ తాడనం ద్వారా గ్రహించినదై తానుకూడ దీస్తదీపంలా మెరుస్తుంది.

7. సమాక్రమము : పురుషుడు భార్యను కూడియుండి ఆమెయొక్క శరీరమునందు మాంసలములైన భాగాలను కేవలము చేతితో అల్పముగా నొక్కుట జరిగితే అది 'సమాక్రమము' అనబడుతుంది. పురుషుడు చేతితో భార్యాశరీరమును తాడించుటకాక ఆక్రమించుటమాత్రమే ఇందు జరుగుతుంది. అందుచే దీనికీపేరువచ్చినది.

8. బద్ధముష్టి : సమాక్రమమే మరికొంత గట్టిగా భార్యా శరీరము బాగుగనొచ్చునట్లు ఆచరింపబడితే అది 'బద్ధముష్టి' అనబడుతుంది. భార్యాశరీరమును చేతితో గ్రహించి గట్టిగా పిడికిలి బిగించుటకో అన్నట్లు వ్రేళ్లు నొక్క బడుటవలన దీనికీపేరువచ్చినది. భార్య దేహమునం దెచ్చటనైనను ఈ బద్ధముష్టి నాచరింపవచ్చును.