పుట:NagaraSarwaswam.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

133


ధ్వనులతో తన బాధను వ్యక్తంచేస్తుంది. ఈ ధ్వనులకు విరుతములని పేరు. అవి ఈదిగువ ప్రకరణములో వివరింపబడుతున్నాయి.

విరుత భేదములు

విరుతము అనగా విశేషధ్వని. సంభోగవేళ భార్యను తాను హేలగా తాడించగా ఆమె 'అమ్మా-ఇస్‌' మొదలగు విరుతాలను ఆచరిస్తే వానిని వినుటచే భర్తయొక్క హృదయములో ఏదో తెలియని ఆనందరేఖ నర్తిస్తుంది. అట్టి ఆనందమును కలిగించున దగుట చేతనే విరుతము ఆలింగన మాదిగాగల రతిభేదములయం దేడవ రతి భేదముగా చెప్పబడినది. ఈ విరుతభేదములు మొత్తము ఏడు. వానిలో మొదటిది స్తనితము.

1. స్తనితము :- స్తనితము అనగా మేఘధ్వని. అనగా ఉరుము. సంభోగసమయమున భర్త భార్యకు కొంచెము నొప్పి తోచునట్లు వర్తించినపుడు కృతకమైన కోపముతో ఆమె "ఊ, ఊ" అని పలికితే ఆధ్వని విశేషము స్తనితము అనబడుతుంది. అలా కోపసూచనకై ఉచ్చరించే ఊకారము జఠరదేశమునుండి ఊర్ధ్వశ్వాసతో వ్యక్తం అవుతుంది. ఈధ్వని మేఘధ్వనిని పోలినదగుటచే దీనికి 'స్తనితము' అను పేరేర్పడినది.

2. కూజితము :- పక్షులు ఆచరించే ధ్వని విశేషములు కూజితము అనబడుతాయి. కూత అను శబ్దము కూజిత శబ్దము నుండియే జన్మించినది. రతివేళ భార్య తృప్తిచెందినపుడామె కంఠమునుండి ఆమెకు తెలియకయే - మిక్కిలి ఉత్సాహముగానున్న పావురముయొక్క "కువకువ" ధ్వనిని పోలినధ్వని జనిస్తుంది. ఈధ్వని విశేషము ఆమెయొక్క పరితృప్తిని సూచించునదగుటచే భర్తయొక్క