పుట:NagaraSarwaswam.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

115

భార్య తన తొడలనుపైకెత్తి, చేతుల సహాయమునుగూడ అవలంబించి రెండుతొడలను బాగుగావిఁడదీసి - రెండుకాళ్ళను రెండు వైపులకుచాచి యుంచగా - ఆవులించిన నోటివలె విడియున్న భార్యయొక్క యోనియందు - భర్త తనపురుషాంగమును సంవిశితముగావించి రమించుట జృంభితబంధమనియు, జృంభ అనగా ఆవులింత, ఇందు యోని ఆవులించిన నోటివలె నుండుటచే దీనికీపేరు తగియున్నదనియు రతిరహస్యకర్త చెప్పెను. చూ. రతిరహస్యం.

10. వేణువిదారణ బంధము :- జృంభితబంధమునందువలె భార్య తన రెండుతొడలను పైకెత్తి భర్తయొక్క భుజములపై నుంచుటకు మారుగా - తన ఒక కాలిని శయ్యపై పూర్తిగా చాచి ఉంచినదై - ఒక కాలినిమాత్రము పైకెత్తి తొడను భర్తయొక్క భుజమునందాన్చియుంచి కూడుటకు వేణువిదారణబంధమని పేరు. వేణు వనగా వెదురు. విదారణమనగా చీల్చుట. వెదురును చీల్చువేళ ఒక పాయను నేలపై త్రొక్కిపట్టి, ఒక పాయను చేతఁబట్టి పైకెత్తి చీల్చుట లోకసాధారణము. సరిగా దానిని పోలిన ఆకృతి స్త్రీయొక్క కాళ్ళకు ఈబంధమునం దేర్పడును. అందుచే దీనికి 'వేణువిదారణ' మను పేరు వచ్చెను.

11. ఇంద్రాణీబంధము :- వనిత శయ్యపై వెలకిలగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళయొద్ద మడచి - ఆ మడత చెడకుండ తొడలయొద్ద కూడ మడచి - మోకాళ్ళు తనయొక్క స్తనపార్శ్వభాగములను తాకుచున్నస్థితియందుండగా - పురుషుడామెయొక్క మోకాళ్ళకు తనమోకాళ్ళు తాకుచున్నస్థితిలో ఆమెను పైకొని రమించుట 'ఇంద్రాణీబంధము' అనబడును.

12. సూచీబంధము :- ఇంద్రాణీబంధమునందువలె వనిత తన రెండుకాళ్ళను కాక, ఒకకాలిని మాత్రమే - మోకాలు స్తన