పుట:NagaraSarwaswam.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114


భాగముతో ఇంచుక వెనుకకు నెట్టుచుండగా - చేతులతో గ్రహించిన భార్య కంఠమాధారముగా భర్త ఆమెమీదకు తూగుచుండును.

6. అర్థపద్మాసనము :- వనిత శయ్యపై వెలికిలిగా శయనించియుండి - తన యొక్క ఒక్కకాలినిమాత్రము మోకాలి దగ్గర మడచి పైకెత్తి యుంచగా - పురుషుడామెను గూడి క్రీడించు స్థితికి 'అర్థపద్మాసనము' అనిపేరు. ఇందు పురుషునియొక్క ఒక్క చేయిమాత్రము - స్త్రీయొక్క మడచియుంచిన మోకాలియొక్క సందునుండి ముందుభాగమునకు చొచ్చుకొనివచ్చును. తనమీదకు వ్రాలియున్న భర్తను భార్య తనయొక్క మడచివుంచిన ఒకకాలితోడనే వెనుకకు నెట్టుచుండుట ఇందేర్పడును. పద్మాసనస్థితి పూర్తిగా కాక సగముగాఏర్పడుటచే దీనికి అర్థపద్మాసనము అని పేరువచ్చెను.

7. పిండితబంధము :- వనిత శయ్యపై వెలికిలిగా శయనించియున్నదై తనకాళ్ళను పైకెత్తి - తన్ను కలియవచ్చిన భర్తయొక్క వక్షముపై తన పాదములను రెంటిని ఆన్చియుండగా భర్త ఆమెనుకూడి రమించుటకు పిండితబంధమని పేరు.

8. అర్థపిండితబంధము :- ప్రియురాలు తన రెండుపాదములను గాక ఒక పాదమును మాత్రమే ప్రియునివక్షమునందు ఆన్చియుండగా (అనగా ఒకకాలు పూర్తిగా చాచియుంచబడును) ప్రియుడామెను గలసి రమించుట 'అర్థపిండితమనబడును'.

9. జృంబితబంధము :- శయ్యపై వెలికిలిగాశయనించి యున్న యువతి తన తొడలను పైకెత్తి, తన్ను కలియవచ్చి తనకు అభిముఖుడై కూర్చుండియున్న భర్తయొక్క భుజములమీద చేర్చగా ఏర్పడు కూటమికి 'జృంభితబంధము' అనిపేరు. రతిరహస్యమునందీ బంధము భిన్నముగా చెప్పబడెను.