పుట:NagaraSarwaswam.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116


పార్శ్వదేశమును తాకునట్లుమడచి - వేరొకకాలిని సరళముగా చాచి యుంచగా - పురుషు డామె కంఠమును కౌగలించుకొని రమించుట 'సూచీబంధము' అనబడును.

13. నాగరకబంధము :- పురుషుడు శయ్యపై వెలికిలగా శయనించియున్న భార్యయొక్క రెండుతొడలమధ్యకును చేరి, ఆమె తొడలను తన పాదములమీదుగా చేర్చి రమించుటకు నాగరకబంధమని పేరు. ఇందు స్త్రీయొక్క తొడలు పురుషుని కటిభాగమునకు (నడుమునకు) బహిర్భూతములగును. ఈ బంధమునందు స్త్రీ సుకుమారముగా చూడబడుటచే దీనికి నాగరకబంధమని పేరువచ్చెను. రతిరహస్యమునందీ బంధము కొంత భిన్నముగా చెప్పబడెను. చూ. రతిరహస్యం.

14. గ్రామ్యబంధము :- నాగరకబంధమున వనితయొక్క తొడలు పురుషుని పాదములయందుండునేకాని, పురుషుని మోకాళ్లు వంచబడి ఆమె శరీరమునందానుట జరుగదు. అట్లుకాక పురుషుడు తనపాదములపై భార్యయొక్క తొడలను జేర్చి రమించుచు, తన మోకాళ్ళను ఆమె తొడలమీదుగా వాల్చి ఆమె కటిభాగమును (నడుమును) తన మోకాళ్ళతో పీడించుచు రమించుట గ్రామ్యబంధమనబడును. దీనియందు స్త్రీయెడ పురుషునివర్తనము నాజూకైనది గాక కొంత మోటదనముతో కూడినదై యున్నందున దీనికి గ్రామ్యబంధమనుపేరు వచ్చెను.

15. కార్కటబంధము :- వనిత శయ్యపై వెలికిలగా శయనించి తన పాదములను భర్తయొక్క నాభిదేశమునందు (బొడ్డు) ఉంచగా ఏర్పడు రమణమునకు కార్కటబంధమని పేరు. ఇందు భార్య యొక్క పాదములు భర్తయొక్క నాభీదేశమును తాకుచుండగా - భర్త ఆమెను కూడవలెను గనుక ఆమె తనకాళ్ళను మడచి ఇంచుక