పుట:NagaraSarwaswam.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

113


తనతొడలను చేర్చగా భర్త ఆమెనుగూడి రమించుట 'మాండూక బంధము' అనబడుతుంది. ఈ బంధమున స్త్రీ శయనించియుండగా పురుషుడు కూర్చుండియుండును. 'మాండూకము' అనగా కప్ప. కప్పయొక్క రతిక్రీడవంటి దగుటచే దీనికీపేరు వచ్చినది.

4. అనుపాదబంధము :- చెక్కిలి (బుగ్గ) యొక్కమీది భాగమునకే హనువని పేరు. భార్యశయ్యపై వెలికిలగా శయనించి యుండి తనకాళ్లను పైకెత్తి - తన్ను కలియవచ్చి తనయోనియందు సంసక్తమైన పురుషాంగముకలవాండై, శయ్యపై తనకెదురుగా కూర్చుండియున్న భర్తయొక్క భుజములమీదుగా - పైకెత్తిన తనకాళ్ళను పోనిచ్చి - తనపాదములతో అతని చెక్కెళ్ల మీది భాగములను తాకుచుండగా రమించు స్థితికి "హనుపాదబంధము" అనిపేరు. భర్తయొక్క చెక్కెళ్ళ మీదభాగమునందు భార్యయొక్క పాదములస్పర్శ ఏర్పడుటవలన ఈబంధమనబడెను.

5. పద్మాసనబంధము :- భార్యశయ్యపై వెలికిలిగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళ దగ్గరమడచి, ఎడమకాలి పిక్కపై కుడికాలి పిక్కకుచేర్చి (బాసికపట్టువేసి కూర్చున్నట్లు) ఉండగా - భర్త ఆమెయొక్క ఈ ఆసనస్థితిని విడదీయకయే ఆమె కాళ్ళను పైకెత్తి ఆమెయొక్క రెండుమోకాళ్ళయొక్క సందులలోనుండి తనచేతులను పోనిచ్చి - ఆమె కంఠమును గ్రహించినవాడై రమించుట 'పద్మాసనము' అనబడుతుంది. బాసికపట్టువేసి పరుండియున్న భార్యయొక్క రెండుమోకాళ్ళ సందులలోనుండియు చేతులనుపోనిచ్చి కంఠమును గ్రహించుటవలన భార్యయొక్క పాదపీఠము (తొడలతో సహా) సహజముగనే పైకిలేచి పురుషాంగము యోనియందు ప్రవేశించుటకు వీలుకలుగును. ఆ సమయమున భార్య తనమీదకు వ్రాలియున్న భర్తను మడువబడియున్న తనకాళ్ళయొక్క మధ్య