పుట:NagaraSarwaswam.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

4. ఉత్థితకరణము :- భార్య నిలచిఉండగా, పురుషుడామె నే గోడకో స్తంభమునకో ఆన్చి రమించుట 'ఉత్థితకరణము' అనబడుతుంది.

5. వ్యానతకరణము :- 'వ్యానతము' అనగా మిక్కిలి వంగినది. భార్య తన చేతులను పాదములను క్రింద ఆన్చి యుంచినదై నాలుగుకాళ్ళ జంతువువలె వంగియుండగా పురుషుడామెను వెనుకనుండి కూడి రమించుట 'వ్యానతకరణము' అనబడుతుంది.

ఇట్లేర్పడిన ఈ కరణ భేదములందు తిరుగ అవాంతరభేదము లెన్నియో ఉన్నాయి. ఆ భేదములకే చౌశీతి బంధములు (84 బంధములు) అని లోకములో వాడుక వచ్చినది. కాని అవి అన్నియును శిష్టజన సమ్మతములు కానందున నాగరిక జనతలో ఆచరణలో ఉన్న బంధభేదములు మాత్రమే (35) ఇందు తెలుపబడుతున్నాయి.

ఉత్తానకరణ భేదములు

భార్య శయ్యపై వెల్లకిలా శయనించియుండగా పురుషుడామెను గూడి రమించు విధానము ఉత్తానకరణము. దీనియందు శిష్ట సమ్మతతైన భేదములు ఇరువది. వానిలో మొదటిది స్వస్తిక బంధము.

1. స్వస్తిక బంధము :- భార్య శయ్యపై వెల్లకిలగా (నడుమును శయ్యపై ఆన్చినదై) శయనించినదై తన కుడితొడను తన ఎడమతొడమీద చేర్చియుండగా భర్త ఆమెనుకూడి రమించుటకు స్వస్తికబంధ మనిపేరు. ఇట్లు ఎడమతొడపై తన కుడితొడను చేర్చియున్నవేళ స్త్రీయొక్క యోనియందు కొంతబిగువు ఏర్పడి, ఆస్థితిలో చేయబడిన రతిక్రీడ ఆమెకు భర్తకుకూడ ఒక వింత ఆనందాన్ని కలిగిస్తుంది.

2. మాండూకబంధము :- భార్య శయ్యపై వెలకిలగా శయనించినదై తన్ను కలియవచ్చిన భర్తయొక్క తొడలమీద