పుట:NagaraSarwaswam.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

111


గలడనుటలో సందేహము లేదు. అయితే స్త్రీ పురుషులు తమ శరీరములను ఏయే స్థితులయందుంచి రమించుటద్వారా ఎక్కువ ఆనందాన్ని పొందడానికి వీలుఉన్నదో అన్న విషయం ఈ ప్రకరణంలో చెప్పబడుతూ ఉన్నది.

సంభోగ సమయములో స్త్రీ పురుషుల శరీరములు (యోని పురుషాంగముతోసహా) పరస్పర సక్తములై ఉండే స్థితి భేదములనే 'సంభోగాసనములు, బంధములు, కరణములు' మొదలగు పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. భిన్నజాతి స్త్రీపురుషులు కలిసినపుడు బాధారహితంగా సుఖించుటకు, సమానజాతి స్త్రీపురుషుల రతియందు నవ్యతను కల్పించుట శాస్త్రములయం దీ కరణభేదములు (బంధభేదములు) చెప్పబడ్డాయి. రతివేళ స్త్రీయొక్క శరీరస్థితి ననుసరించి ఈ ఆసన భేదములు ప్రధానంగా ఐదు రకాలుగాఉన్నాయి. 1. ఉత్తానకరణము 2. తిర్యక్కరణము 3. ఆసీనకరణము (స్థితకరణము) 4. ఉత్థితకరణము 5. వ్యానత కరణము అని వాని పేర్లు.

1. ఉత్తానకరణము :- ఉత్తానమనగా వెలికిల పడియున్నది. భార్య వెలికిలిగా పరుండియున్నపుడు (నడుమును సెజ్జపై ఆన్చి పరుండుట) పురుషుడామెను గూడినచో అది 'ఉత్తానకరనము' అనబడుతుంది.

2. తిర్యక్కరణము :- తిర్యక్ అనగా 'ఏటవాలు' అని అర్ధము. శయ్యపై భార్య ప్రక్కవాటుగా కుడిప్రక్కకునైనను లేక ఎడమప్రక్కకునైనను వ్రాలి పరుండియుండగా పురుషుడామెనుకూడి రమించినచో అది 'తిర్యక్కరనము' అనబడుతుంది.

3. ఆసీనకరణము :- భార్య కూర్చుండియున్నపుడు పురుషుడామెతో గలిసి రతిక్రీడాసక్తుడైనచో ఆస్థితి ఆసీనకరణము అనబడుతుంది.