పుట:NagaraSarwaswam.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4


ఆమాట ఆమాటచెప్పి కుమారులకు యుక్తవయస్సు వచ్చినది, వారికి తగిన కన్యలను వెదకి పెండ్లి చేయాలి. - అన్న తన ఆలోచనను వెల్లడించాడు. దానికి వారంతా సంతోషించారు.

నలుగురు కుమారులకు తగిననారు - అందగత్తెలు విద్యా వినయాలలో సాటిలేనివారు అయిన రాజకుమార్తెల చిత్రాలను దేశ దేశాలనుండి త్వరలో రప్పించమని రిపుంజయుడు తన మంత్రికి ఆజ్ఞాపించాడు.

కొంతకాలానికి ఎందరో సుందరాంగులైన రాకుమారికలయొక్క చిత్రాలు రివుంజయుని అంతఃపురానికి చేరుకొన్నాయి, వారంతా పరమ సుందరులు. ఒకరిని మించిన సౌందర్యం మరియొకరిది. ఆ చిత్రాలకు దిగువనే వారి విద్యాపాటవాలు గుణస్వభావాలు సంక్షేపంగా వ్రాయబడ్డాయి.

రిపుంజయుడు ఈ మొత్తం చిత్రాలనన్నిటిని ఎదుటబెట్టుకొని భార్యల తోడ్పాటుతో అందులో మేలైన చిత్రాలను నాలిగింటిని ఎన్నిక చేసాడు. ఆ నలుగురు గుణరూప స్వభావాలలో మిగిలిన రాకుమారికలకంటే మిన్నగా వున్నారు. వారి రూపసౌందర్యాలు భిన్నంగావున్నా నిరుపమానంగా వున్నాయి. అందుచే రెపుంజయుడు ఆ నలుగురను తనకు కోడండ్రుగా చేసికొనాలని ఊహించాడు. అయితే ఏ కన్యక నేకుమారునకు చేసికొనుట అన్నది ఇంకను తేలలేదు. అందుచేత రాజు ఆ చిత్రాలను నాల్గింటిని తీసికొని పెద్దభార్యతో ఆలోచించారు. అమె ఆ నాలిగింటిలో తనకుమారునకు తగిన కన్యయొక్క చిత్రాన్ని ఎన్నికచేసికొన్నది. అనంతరం ఆ రాజు రెండవభార్య సన్నిధికి మిగిలిన మూడు చిత్రాలను తెచ్చి వీనిలో నీరు నచ్చిన చిత్రాన్ని యెన్నిక చెయ్యి. ఆమెతో నీ కుమారుని వివాహం జరిపిస్తానన్నాడు.

"ఈ చిత్రాలు నాలుగుకదా! మూడే వున్నాయేమి”? - అన్నదామె.