పుట:NagaraSarwaswam.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3


గురువు చెప్పడమే తడవుగా అన్ని విధ్యలు గ్రహిస్తూవచ్ఛారు. పదునారేండ్లు వయస్సువచ్చేసరికి వారికి రాని విద్యఅంటూ లేదు. శాస్త్రాలు వల్లించుటయేగాక అన్నిరకములైన ఆయుధవిద్యలయందు వారు ఆరితేరారు. అంతేకాక అశ్వారోహణ, గజారోహణ, రథారోహణలయందు సేనలను సడఫుటయందు. వ్యూహములను కల్పించుట యందుకూడ సుశిక్షితులయ్యారు. ఆ రాకుమారులు పదునారేండ్ల వయస్సు కలవారే అయినప్పటికి నిరంతరం వ్యాయామం చేయడంవల్ల వారి శరీరాలు మంచిపుష్టి కలిగి సమున్నతంగా వున్నాయి.

రిపుంజయుడు తన కుమారులను చూచిమురిసిపోతున్నాడు. ఒకనాడాయన సభలో కూర్చుండి వుండగా ఒక రాజదూతవచ్చి ఆహ్వానపత్రిక నొకదానిని ఆయన చేతిలోపెట్టాడు. అదియొక రాకుమారి యొక్క స్వయంవరాహ్వానం, ఆ రాకుమారిక పేరు స్వయంప్రభ, ఆమె యొక్క సౌందర్యంముందు దేవతల సౌందర్యంకూడా ఎందుకూ కొఱగానిదని, సంగీత సాహిత్య విధ్యలలో ఆమె సాటిలేదని ప్రసిర్థి. ఆ రాజకుమారియొక్క స్వయంవరానికి రానలసిందని ఆహ్వానం వచ్చింది.

అ ఆహ్వానాన్నిచూచి రిపుంజయుడు - నేను స్వయంవరానికి వెళ్ళడం ఏమిటి? నాకు నలుగురు భార్యలున్నారు, రత్నాలవంటి నలుగురు కుమారులున్నారు అనుకొన్నాడు. ఈ స్వయంవరానికి కుమారులను పంపితే బాగుంటుదనుకొన్నాడు. కాని ఆయన కుమారులంతా గంటలు, ఘడియలు తేడాలో సమవయస్కులు, ఆ రాచకూతురు వీరిలో ఒకరిని వరించినా మిగిలిన ముగ్గురకు పెండ్లికూతుళ్ళను వెదకాలి కదా! అందుచేత ఇది బాగలేదు. నలుగురకు చక్కని కన్యలను వెదకి ఒకేసారి ఒకే ముహూర్తాన పెండ్లిచేస్తే బాగుంటుందనుకొన్నాడాయన. ఈ ఆలోచన రావడంతో ఆయన సభచాలించి అంతఃపురానికి వెళ్ళాడు.

అంతఃపురములోనికి రిపుంజయుడు అడుగుపెట్టగానే ఆయన భార్యలు నలుగురు ఆయన కెదురుగా వచ్చారు. ఆయనవారితోకలిసి