పుట:Naganadham.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వలోదయం 5

మరి ఆమెకు కాబోవు భర్తగా ఎవరిని సృష్టించెవు!’ అని అడిగాను. "నిషధేశ్వరుడైన నలుడీమె భర్త" అని అతడు చెప్పేడు. అమ్మాయీ, నీవు నలుని గురించి విన్నావోలేదో. అతడు అందాలకి మన్మధుడు, ప్రతాపానికి సూర్యుడు ఐశ్వర్యానికి కుబేరుడు,అన్ని విద్యలు ఎరిగిన అపరసరస్వతి. నీకిష్టమైతే నలమహారాజు వద్ద సీరూపగుణాతిశయాలు వర్ణించి అతని మనస్సు నీపై లగ్నమయే ఉపాయం చేస్తాను.సరేనా?

హంస మాటకారితనానికి దమయంతి ఆశ్చర్య పోయింది. తను వలచిన నలిఉణ్ణి తనకు భర్తగా సృష్టించిన బ్రహ్మకు మనస్సులో వేయి నమస్సులందించింది. "బ్రహ్మ దేవుని మాట జరుగవలసినదే కదా. నీయిష్ట" మని ముభావముగా హంసతో పలికి తన సమ్మతి వెల్లడించింది.

హంస వెళ్లినది మొదలు దమయంతికి మనస్సు మనస్సులో లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ ఆమెకంటి ముందు నలుని రూపమే గోచరిస్తూంది. ఏపని లోనూ ఆమెకు మనస్సు పట్టదు. ఎప్పుడుచూచినా పరధ్యానంగా ఉంటుంది. చెలికతైల వలన ఆయీసంగతి విని తల్లి దండ్రులామె వివాహానికి సన్నాహాలు చేయసాగేరు.

ఆ రోజులలో రాజకన్యకలకి స్వయంవరాలు జరిగేవి.అంటే రాకుమారి తనకు నచ్చిన వరుని మెడలో పూలదండ వేస్తుంది, అందుకని రాకుమారు లందరినీ ఆహ్వానిస్తారు. భీమసేనుడు కూడ తన కుమారైకు స్వయంవరమని దేశంలో