పుట:Naganadham.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వతిగా దమయంతిని ఆమెకు తగిన ఉజ్జీగా పురుషులలో అందగానిగా నిన్ను బ్రహ్మ సృస్టించాడు. మీ యిద్దరికీ వివాహమైతే బాగుంటుందికదూ, చూడు నీకిష్టమైతే దజ్మయంతి దగ్గర నీగుణగణాలు వర్ణించి ఆమెను నీకు సుముఖురాలుగా చేస్తాను. మరి శలవు" అని చెప్పి ఆ హంస ఎగిరి పోయ్హింది. నలునికి కురూహలం, ఆశ్చర్యం , హర్షం ఆశ కూడా కలిగి, ల్చాలసేపు ఆ హంసపోయిన మార్గాన్నే అలా చూస్తూ నిలిచి పోయాడు.

దమయంతి అంతఃపుర వాటికలో విహరిస్తూ ఉండగా హంస అక్కడికి చేరుకుంది. అలసి సొలసినదానివలె నచ్చి ఆమె సమీపంలో వ్రాలి, తిరిగి ఎగరబోయి బోర్లపడ్డట్టు నటించింది. దయామయురాలైన దమయంతి ఆ హింసను పట్టుకొని ఒడిలోపెట్టుకొని రెక్కలు నిమురుతూ, చెలికత్తెలతో చెప్పి పాలు తెప్పించి పట్టింది. సేదదేరిన తర్వాత ఆ హంస మానవ వాక్కులలో యిలా చెప్పింది.

"రాజకుమారీ, ఈ నీ ఉపకారం ఎన్నటికి మరిచి పోను, సేవలన నేడు నా ప్రాణాలు నిలిచేయి. నేను మామూలు హంసను"కాను. బ్రహ్మదేవునివాహనాన్ని. నీ విషయంలో ఒకప్పడు బ్రహ్మనాతో చెప్పిన రహస్యాన్ని నీకు చెప్తాను. ఆ రోజున బ్రహ్మదేవుడు నా వీపుమిూద సవారీ అయి కైలాసానికి వెళ్తున్నాడు. ఈ వూరి విూదుగా ఎగిరి వెళ్తున్నాము. నాకొక కత్తూహలం కలిగి "మహాత్మా, దమయంతివంటి సౌందర్యవతి నిక్కడ సృష్టించేవకదా,