ఈ పుటను అచ్చుదిద్దలేదు
రాజులందరికీ వర్తమానాలు పంపేడు. చప్పన్న దేశాల రాజులు స్వయంవరానికి తర్లి వెళ్లారు. నలుడుకూడ బయల్దేరాడు. నారదుని వలన దమయంతి చక్కదనాన్ని విని దేవలోకంనుండి దిక్పాలకులుకూడ స్వయంవరానికి వచ్చారు. దారిలో వారు నలుణ్ణీ చూసేరు. అతని రూపలావణ్యాలు చూచి అబ్బుర పడ్డారు. అటువంటి అందగాణ్ణి విడిచి దమయంతి తమలో ఏ ఒక్కరినీ వరించదని తేల్చుకున్నారు. అందుకని నలుణ్ణి స్వయంవరానికి రాకుండా చేసే ఉపాయం ఆలోచించారు.
తమ ఉపాయాన్ననుసరించి దేవతలు నలుని తమ వద్దకు పిల్చి ఇలా చెప్పేరు "నిషధేశ్వరా, నీకీర్తి ఎంతగానో వింటున్నాము. నీ గుణగణాలు దిక్కులన్నిటా మారుమ్రోగుతున్నాయి. మేము ఇంద్రాగ్ని యమ వరుణులము. నీవలన మాకొక ఉపకారము కావలసివుంది. ఈ దేవకార్యానికి నీవు తప్పక తోడ్పడతావని ఆశిస్తున్నాం." నలుడు ఆ నలుగురు దిక్పాలకులకు నమస్కరించి "నాశక్తివంచనలేక మీ కార్యానికి తోడ్పడతాను. అదేదో శెలవివ్వండి" అన్నాడు.
వరుణుడు ఆడినమాట తప్పవలన నేవాడు కాదు. అందుకని దేవరలు ముందుగానే అతనివద్ద అంగీకారముద్ర గ్రహించి ఆమీద "నీవు దూతగా దమయంతి వద్దకుపోయి మా మా గుణాతిశయాలు వర్ణీంచి, ఆమెను మా నల్వురిలో ఎవరినైనా ఒకరిని వరించమని ప్రోత్సహించాలి. అంత:పురంలోకి ఎట్లా