పుట:Naganadham.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జన్మలో కాకపోతేమానె, మరొక జన్మలోనైనా నన్ను జీమూతవాహనుని భార్యగా పుట్టించు" ఐ దేవిని ఆఖరిసారి ప్రార్ధించి, మడలో ఉరివేసుకొంది. పైటచెరగు చాల లేదు. దగ్గరసాఉన్న తీగలు మెడకు చుట్టుకొని చెట్టుకి వ్రేలాడింది.

చతురిక మొదటినుంచీ అనుమనిస్తూంది. ఒక్కర్తెనూ వదలివెళ్తే యీ రాజకుమార్తె ఏ ఘాతుకమో చేసి పోతుందేమోనని, కొంతదూరం మిత్రావసుని వెంటవెళ్ళి నట్లె వెళ్ళి తిరిగివచ్చి రాజకుమార్తె నొకసారి చూచి పోబోయింది. ఇకనేముంది. ఆమ భయబడి నట్లేఅయింది. గుండె జల్లుమంది. లబో దిబోమని గోలపెట్టి దగ్గరసా పరుగెత్తుకెళ్ళింది. "అయ్యయ్యో, మా రాజకుమారి, మలయవతి ఉరిలోపడి కొట్టుకుంటూంది. రక్షించండి రక్షించండి" అని బొబ్బలు పెట్టి ఏడవసాగింది.

చతురిక బొబ్బలు వినగానే జీమూతవాహనుడు తాను వ్రాస్తూన్న చిత్రాన్ని విడిచి, మలయవతిని రక్షించడానికి పరుగెత్తాడు. మొలనున్న కత్తితో తీగలుకొసి మలయవతిని ఉరిలోనుండి తప్పించాడు. "ఎవరిది?" అని ముఖంచూచి, తాను వలచిన విద్యాధరియే యీ మలయవతి అని గ్రహించి, అపరింతంగా ఆనందించాడు. ఆత్మహత్యా ప్రయత్నానికి హేతువు తెలిసికొని, ఆమె రెక్కపట్టుకొని తాను వ్రాస్తూన్న చిత్రంవద్దకు తీసుకుపోయి, 'ఇదిగో, ఈమె నా హృదయేశ్వరి ' అని చెప్పి నవ్వించాడు.