పుట:Naganadham.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంతలో జీమూతవాహనున్ని రమ్మని పిలువడానికి ఆత్రేయుడు వచ్చాడు. "మీతండ్రిగారు మలయవతిని కోడలుగా గ్రహించడాని కంగీకరించారు పెళ్లికొడుకు వయ్యావు పద" మన్నాడు. అందరూ నవ్వుతూ, సరసాలు, పరిహాసాలు పలుకుతూ ఇంటికి మరలేరు.

ఒక చక్కని శుభముహూర్తంలో మలయవతీ జీమూతవాహనుల వివాహం మహావైభవంగా జరిగింది. వివాహమైన తర్వాత కొన్నాళ్లు అత్తవారింట్లోనే ఉండి జీమూతవాహనుడు సకల సౌఖ్యాలు అనుభవిస్తూ, ఆత్రేయ మిత్రావసువులతో కలిసి అక్కడా ఇక్కడా విలాసంగా విహరిస్తూ కాలం గడుపుతూ వచ్చారు. తన రాజ్యలోభంతో హుద్దానికి బహల్దేరలేదు. పదిమందిని చంప్ తెచ్చిన రక్తపుకూడు కంట, పండుటాకులో, పండుకాయలలో తిని బ్రతకటం ఉత్తమోత్తమమైన పద్దతి అని నిర్ణయించుకొని, అదే నీతిని ఆచరణకి తెచ్చుకొన్నాడు.

ఒకనాడు జీమూతవాహనుడు మిత్రావసువుతో కలిసి సముద్రతీరంలో విహరైస్తున్నాడు. తత్సమీప్ంలో ఉన్న పర్వతాల పంక్తినిచూచి మెచ్చుకొంటూ నడుస్తూఉంటే మిత్రావసువు జీమూతవాహనునితో ఇట్లాచెప్పాడు. "బావా ఇవి మలయపర్వతపు శిఖరాలు కావుసుమా, చచ్చిపోల్యిన పాముల ఎముకల గుట్టలు."