పుట:Naganadham.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్ను ఆజ్ఞాపించి పంపేరు. మా చెల్లెలు మలయవతిని నీవు పరిగ్రహించ వలసినదని ముందుగా నేను ప్రార్ధస్తున్నాను. మాతండ్రిగారి ప్రార్ధన మీ తండైగారి సమ్మతి తరువాత విందువుగాని" అని అతడు జీమూతవాహనునితో చెప్పిన మాటలు వినగానే మలయవతికి ఎంతగానో ఆశ్చర్యం, ఆశ, ఆనందంకూడ కలిగాయి. చరురిక "భేష్, ఇదంతా దేవికృప" అన్నది.

"ఆర్యా, మీ ఆదరానికి ధన్యవాదాలు, కాని నా మనస్సు అప్పుడే వేరొక సుందరిపై లగ్నమయింది. ఇప్పుడు మరొక ప్రక్కకు దానిని మరలించడం, ధర్మమా? అధర్మమా? అనే ప్రశ్న అటుంచి, అసలు నా వశంలో లేని విషయము కాబట్టి మీరు నన్ను క్షమిస్తూ, యీ మాటలు మీ తండ్రిగరితో చెప్పవలసిందని మిమ్మల్ని ప్రాద్ర్హిస్తున్నాను" అని చెప్పి జీమూతవాహనుడు యింటికి పొవడానికి కూడ నిరాకరించాడు.

మిత్రావసువు ఆత్రేయునితో సలహాచేసి జీమూతకేతువుతో చెప్పి వ్యవహారం సానుకూలం చేసుకొందామని బయల్దేరాడు. అదేదో చూచిరావలసిన దని చరుతికను అతని వెనుకనే పంపించింది మలయవతి. కాని ఆమెకు నమ్మకం లెదు. తన బ్రతుకుమీద తనకే అసహ్యం వేసింది. చతురిక వెళ్లిన పిదప ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దు:ఖము మరింత్ ఎక్కువైంది. తుదకు పైట చెంగుతో మడకు ఉరిపోసుకొని ఆత్మహత్య ఛేసుకొందామని నిశ్చయించింది. "దేవీ, ఈ