పుట:Naganadham.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లన్నీ చక్కగా చూచి, అన్వయించి అనుమానించాడు. అన్నీ సరిగా ఉన్నా రూపులో నలునికీ, బాహుకునికీ స్వర్ల మత్త్యాలకన్నంత ఎడముంది. అందుచేత అతడు నేరుగా వచ్చ దమయంతి కీసంగతి విన్నవించాడు. దమయంతికూడ అను మానించింది. "కారణాంతరాలచేత రూపు మారిపోయి ఉంటుందని నిశ్చయించింది. ఏదో ఉపాయంచేత అతణ్ణి విదర్బ నగరానికి రప్పించాలని ఆలోచించింది. తిరిగి ఆ సుదేవుని చేతనే దమయంతీ ద్వితీయ స్వయంవరానికి తాము దయ చేయ వలసినదని ఋతుపర్ణునికి ఆహ్వానం పంపే ఏర్పాటు చేసింది. స్వయంవరం రెండురోజుల వ్యవధిలో జరుగుతుందని చెప్పమంది. అంతతొందరలో రావాలంటే నలుడుతప్ప మరెవ్వరూ సారథ్యంచేసి ఋతుపర్ణునికి సహాయపడలేరని ఆమె ఎరుగును. ఎంతమాసినా నూనవంతుడైన నలుడు, దమయంతీ ద్వితీయ స్వయంవరమనే మాటవింటే, బయట పడి తీరతాడనే నమ్మకం కూడ ఆమెకుంది. అందుకని పన్నాగం పన్నింది.

   స్వయంవర వార్త వినగానే ఋతుపర్ణుడు ప్రయాణసన్నద్ధ డయ్యాడు. కాని వ్యవధిలేదే. ఏమి చేయవలెనో పాలుపోక దిగులుగా కూర్చొన్నాడు. బాహుకుడు కూడ ఈ వార్త విన్నాడు. అతనికి వంటివిూద తేళ్లూ, జెర్రులూ ప్రాకినట్టని పించింది. ఎలాగైనా స్వయంవర సమయానికి తానుగూడ విదర్శనగరం పోవాలని నిశ్చయించాడు. అందుకని రాజు గారికి తాను సారధిగా ఉండి, ఈ అల్పవ్యవధిలో అతనిని