పుట:Naganadham.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయోధ్యనుండి విదర్శకు చేరుస్తానని ఒప్పకున్నాడు. ఋతు పర్ణుడు పరమానందభరితుడై బయల్దేరాడు.

నలుడు అశ్వహృదయమనే విద్య ఎరుగును. అంచు వలన అతని సారధ్యంలో గుర్రాలు గాలికంటె వడిగా పరిగెత్తి పోవసాగేయి. ఋతుపర్ణుని అంగవస్త్రం గాలి కెగిరి పోయి క్రిందపడింది. దానిని తిరిగి తెచ్చుకోవాలని అతడు రధమాపనున్నాడు. కాని బాహుపడు 'మహారాజా రధం నాలుగుమైళ్లు ముందుకువచ్చింది. దిగి వెళ్తారా!" అన్నాడు. ఋతుపష్టడు మహాశ్చర్యపోయి, తానెరిగిన అక్షహృదయమనే విద్య "బాహుకుని కిచ్చి, అతనివద్ద అతనివద్ద తాను అశ్వహృదయం నేర్చుకొన్నాడు. అనుకొన్న సమయానికి ఒకపూట ముందుగానే ఋతుపర్ణుని రధం విదర్భ చేరుకుంది. బాహుకుడు వంటశాలకి వెళ్లాడు. ఋతుపర్ణుడు తనకని సగౌరవంగా అమర్చిన విడిదిలో బసచేసాడు. కాని స్వయంవరానికి మరే రాజకుమారులు రాకపోవడం చూచి. మొదట ఆశ్చర్య పడ్డాడు. తనొక్కడే వచ్చినందుకు ఆవిూద లోలోపల సిగ్గుపడ్డాడు.

దమయంతి బాహుకుని పరీక్షించడానికని తన చెలికత్తె భారతిని నియోగించింది. ఆమె వెంట, తనబిడ్డ లిద్దరినీ పంపింది. నలుడా పిల్లలనుచూచి కంటతడి పెట్టుకొన్నాడు. ఎత్తుకొని ముద్దాడేడు. తనపిల్లలలాగే ఉన్నారనీ, అందుకని అంతగా అభిమానం కలిగిందని చెప్పి చూపరుల ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని తగ్గించజూచాడు. "రేపు దమ