పుట:Naganadham.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

yశీ ద య 0 21 అరణ్యంలో అమాయికురాలిని నొక్క రైను విడిచివెళ్లాడనే చేరానికి సలుణ్ణి అందరూ నిందిస్తారు. తనభర్తను "గా విందిస్తూంటే వినడం ఆ పతివ్రతకు కిట్టదు. అందువల్ల, ఆప్పటి కనుకూలంగా చెప్పి, అజ్ఞాతంగా కొన్నాళ్లు కాలం గడపటానికి నిశ్చయించింది.

నలుడు రాజ్యభ్రష్టుడై దమయంతితో కలిసి ఎటో హోయాడని తెలిసిన దగ్గరనుండి భీమసేనుడు వారిద్దరినీ వెదకి రావలసినదని చారులను నాల్లు ప్రక్కలా పంపి ప్రయత్నిస్తున్నాడు ఆచారులలో సుదేవుడనే ఒక ప్రాజ్ఞుడైన బ్రాహ్మడున్నాడు. అతడు చేది నగరంలో దమయంతినిచూచి, ఆన వాలు పట్టి, సుబాహుని కామె పరిచయం చెప్పి, అతని అనుమతిమీద సగౌరవంగా దమయంతిని విదర్భనగరానికి పంపే ఏర్పాట్లు చేయించాడు.

       దమయంతి పుట్టింటికి చేరుకొంది. తన పిల్లలిద్దరినీ చేరతీసి కౌలించుకొంది. తల్లిదండ్రుల చాటున ఉన్నా, భర్న పరారీ అయిఉన్నాడనే దుఃఖంచేత దినదినమూ కృశించిపోతూ, ఎడబాటు సహిస్తూ, నలుని రాక - కెదురు చూస్తూ ఎలాగో కాలం గడపసాగింది. నలునిజాడలు వెదక కానికి నలుప్రక్కలా దక్షులైనవారిని పంపుతూ, అతణ్ణిపోల్చు కొనేందుకు అనువైన గుర్తు లెన్నో వారికి చెప్పిపంపింది." 

అదృష్టవశాత్తూ, దమయంతిని పోల్చి తెచ్చిన సుదేవుడే, అయోధ్యలో, బాహుకుణ్ణి చూసేడు. దమయంతి చెప్పిన లక్షణాలు, బాహుకని మాటలు, నడవడి, వగైరా