పుట:Naganadham.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గైనా వారిని నానాబాధలు పెట్టి తనక్షసి తీర్చుకోవాలనే పంతంపట్టి నిషధపురం ప్రవేశించాడు.

     నలుడు ధార్మికుడు, సత్యవ్రతుడు, సజ్జనుడు. సర్వులకూ ఆదర్శ పురుషుడు. అయితేనేమి, ప్రమాదం ఎంతవారి కైనా వస్తుంది. ఒకప్పకు నలుడు కొంచెం బొల్లివిడిచి కాళ్లు కడుగుకొన్నాడు. సరి! కలిమహారాజు అదే సందుచేసుకొని నలుణ్ణి ఆవహించాడు. తన శరీరంలో కలి ప్రవేశించినదే తడవుగా నలుని వివేక బుద్దులు అడుగంటేయి. ఆలస్యం పెరిగింది. అనాచారానికి పెంపు కలిగింది.

నలుని జ్ఞాతులలో పుష్కరుడనే ఆయన ఒకడున్నాడు. అతడు త్రాగుబోతు, జూదరి, వ్యభిచారి, అబద్ధాలకోరు, అన్యూఅయానికి వెనుకాడని చెయ్యి, కలిమహారాజుకి నచ్చిన స్నేహితుడు. నలునితో జూదమాడి అతని రాజ్యాన్ని గెల్చుకోమని కలి పుష్కరునికి సలహాయిచ్చాడు. తాను పాచిక లలో నిల్చి పుష్కరుని విజయానికి తోడ్పడతానని మాట యిచ్చాడు. ఈ మద్దతుతో మదించి పుష్కరుడు నలుణ్ణి జూదానికి ఆహ్వానించాడు. బుద్ధిపెడతల బట్టి నలుడు జూద చూడటానికి అంగీకరించాడు! అదేమి జూదం! అంతా కలి మాయ. నలుడు తాను పెట్టిన పణాలన్నీ ఓడిపోతాడు. పుష్కరుడు వేసినపాచికలన్నీ గెలుచుకొంటాడు. ఇదే వరుసలో జూదమూడి నలుడు తన రాజ్యమంతా పుష్కరునికి ఓడిపోయాడు. “ఏముందిక? దమయంతినికూడా ఒడ్డతావా?" అని అడిగాడు పుష్కరుడు! నలుడు తనతప్పిదాన్ని గ్రహిం