పుట:Naganadham.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సందేశాన్ని వినకపూర్వమే నా మనస్సు సలాయ త్తమైంది. నలుని నరించడం నాధర్మం, ధర్మానికి తోడ్పడమని ధర్మమూర్తులైన మిమ్ములను నెను వేడుకొంటున్నాను" అని వారందరికీ నమస్కరించింది. . దేవతలు పసన్నులై నిజరూపాలతో లేచి నిలు చున్నారు. అసలు నలుడెవరో అందరికీ అర్థమయింది. దమయంతి ఆతని మెడలో పూలమాల వేసింది. సభ జయజయ ధ్వాగాలతో మార్మోగింది. దేవతలు నల దమయంతు లిద్దరినీ ఆశీర్వదించి తమలోకానికి వెళ్లిపోయారు. మహావైభవంగా దమయంతీ నలముహా రాజుల వివాహం జరిగింది. కాంకలు, కట్నాలు, పుచ్చుకొని, అత్తమామలవద్ద శెలవు పుచ్చుకొని, దమయంతీ ద్వితీయుడై నలుడు తన రాజధాని చేయకొన్నాడు.

కొన్నాళ్ళకి ఆ దంపతులకు ఇంద్రసేనుడనే కొడుకు, ఇంద్రసేన అనే కూతురు పుట్టేరు. కాని. చెల్లీ ఒకరు బాగుంటే చూచి సహించలే వాళ్లుంటారుకదూ! విను.

దమయంతీ స్వయంవరానికి వచ్చిన దేవతలలో కలిపుయపుడు కూడ ఉన్నాడు. అతడు కామ క్రోధ లోభ మోహాదులకి రాజు. అనాచారాత్యా చారాలు రోగ దుర్బిక్షాలు, దారిద్ర్య దుఃఖాలు అతని పరివారం. ఒకరిని బాధించి సంతసించడమే ఆయనకు ప్రియం. ఆ మహాను భావునికి నలదమయంతుల వివాహం కన్నుకుటు అయింది. వారి సౌఖ్యం అతడు చూచి సహించలేకపోయాడు. ఎలా