పుట:Naganadham.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాడు. కాని జరిగినదానికి పశ్చాత్తాప పడి ఏమిలాభం! తన ఓటమి అంగీకరించి దమయంతితో కలసి ఊరువిడిచి ఎక్కడికో పోవడానికి ఉద్యక్తుడయాడు. దమయంతిని విదర్శనగరం పంపివేయాలని అతని ఊహ. కాని దమయంతి కష్టకాలంలో తన భర్తను విడిచి వేరేఉండ గలదా! పిల్లలిద్దరినీ మాత్రం విదర్సనరానికి పంపి, తాను భర్తతో అరణ్యాల వెంబడీ పోవడానికే ఆ పతివ్రత నిశ్చయించింది. ఊళ్ళో ఎవరు వారి కాశ్రయమిచ్చినా వార శిక్షార్హులు. అది పుష్కరుని మొదటి శాసనం. నల దమయంతులు కట్టు గుడ్డలతో కాన కేగవలసినదే కాని། తమ వెంట ఏవిూ తీసుకొని పోకూడదు. ఇది అతని రెండవ శాసనం.

నలుడు ప్రతి పలుక లేదు. దించిన తల ఎత్తలేదు. కోప తాపాలణచు కొన్నాడు. తనతోపాటు దమయంతికి వచ్చిన కష్టాలుచూచి నీరుగ్రుక్కుకున్నాడు. విధివైప రీత్యమని ఎంచి, లేనిదైర్యం తెచ్చుకొని అరణ్యానికి త్రోవ తీసేడు.

అది బ్రహ్మాండమైన కీకారణ్యం. పట్టపగలే అక్కడ చీకటి జీమూతంగా ఉంటుంది. కీరుమని కీచురాళ్లు అరుస్తూనే ఉంటాయి. మధ్య మధ్య పులులు, సింహాలు గర్జిస్తాయి. ఏప్రక్కనుండి ఏమి వస్తుందో తెలియదు. ఏ డొంకలో ఏ ముందో అనే భయం అలాటి అడవిలో కంకరరాళ్లూ ముళ్లూ గ్రుచ్చుకొనే త్రోవలో నడచి తనవెంటవస్తూన్న సుకుమారి