పుట:Naayakuraalu.Play.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

93

నర : శత్రువులు మాచర్లను విడువకపూర్వం అచ్చట జరిగిన ఆలోచనసభలో బాలుడు మొదలయిన యువకులు వొడంబడిక ప్రకారం మాచర్లను విడిచిపోకూడదనీ, యిప్పుడే యుద్ధముజేసి వీలయితే గురిజాలనుసహా. సంపాదించవలసినదనీ వాదించారు. ప్రస్తుతం యుద్ధం జేసి నెగ్గలేమని బ్రహ్మనాయుడు నచ్చజెప్పితే సంక్షేపించుకొన్నారుగాని పూర్తిగా మానుకోలేదు. ఈ వొడంబడిక యేడుసంవత్సరము లయినా మాచర్ల మనకు వదిలి పెట్టరు. . సేనలను సమకూర్చుకోవడం పూర్తిజేసుకొని, యే అపరాత్రివేళ మాచర్ల మండలంమీద వచ్చిపడతారో చెప్పలేము. పల్నాటి సరిహద్దులకు కొంత దూరములో నయినా విడిది యేర్పరచుకొన్నట్లేతే వాండ్లు బయలుదేరేజాడలు కనిపెట్టి సకాలములో యెదుర్కోగలంగాని మందట చెట్టుమీది గద్దలాగ పీటపెట్టుకొని సమయానికై వేచివుండి యేమరుపాటున మాచర్లను తన్నుకొని పోవడానికి సిద్ధంగా వున్న వాండ్లను అడ్డటం కష్టం.

నల. రా : తమ్ముడూ, నీవు దూరదృష్టి గలిగి యోచించి చెప్పినదంతా వాస్తవమేగాని మన మేకారణంచేత వారిని దూరంగా పంపగలం?

నాయ : నా కొక్క మాటచెప్పండి. ఈ యేడేండ్లు షరతుల ప్రకారం వారు నడుచుకొని తరువాత రాజ్యమియ్యమంటే యిచ్చివేస్తారా?

నల. రా : అది యెప్పుడూ జరుగదు. తిరిగి వారికిచ్చే కాడికి యిప్పుడు వారిని వెళ్లగొట్టడమెందుకు ?