పుట:Naayakuraalu.Play.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

నాయకురాలు

నే నెరవేర్చాను. ఇది నాకూ తరణోపాయమే. నా కిట్టి వీలును నే కోరకుండానే కలిగించినందుకు తమకు నే నెంతయు కృతజ్ఞురాలనై వుండవలసివున్నది.

నల. రా : ఈ అవకాశమును మేము గలిగించడమేమి? మీ అర్హతే మీకు ఒనగూర్చింది.

నాయ : యోగ్యతనుబట్టి యోచించేయెడల మానవుడు దేనికీ అర్హుడుగాడు. పరమేశ్వరుని కృపచేతనే మన కన్నీ ప్రసాదింపబడుతున్నవి. మన ప్రయత్న మూరక నిమిత్తమాత్రమే.

నల. రా : భగవంతుడు మిమ్ము నొకసాధనంగా వుపయోగించ దగినట్టు భావించడమే మీ అర్హతను తెలియజేస్తున్నది.

నాయ : కార్యసాఫల్యమునకు దైవ పురుషకారముల రెంటియొక్కయు ఆవశ్యకతను బహుసమర్థతతో నిరూపించారు.

నర: తమ రింతవరకు మాట్లాడినదంతా గతముయొక్క ప్రశంస. ఇకముందు జరుగవలసినదానిలో దైవము సంగతి అటుండ నిచ్చి, మీ రిద్దరు చేయవలసిన పురుషకారముమాత్ర మెక్కువగా వున్నది. పురుషప్రయత్నము ఫలించడమూ, ఫలించక పోవడమూ గలదుగాని, యిప్పుడో, యెప్పుడో చేసినకర్మలకు ఫలమియ్యడందప్ప పరమశివుడుగాని పరకేశవుడుగాని యేమీ ఊరక ప్రసాదించినట్టు నే వినలేదు. దీనిని తమరు బౌద్ధవాద మంటారుగామాలె.

నల. గా : అభిప్రాయ భేదములున్నా మాకూ తమ్ముడికీ ఆచరణలో భేద మెప్పుడూ కలుగ లేదు. మా తమ్ముని ఉపదేశములను యిదివరకు వినక చెడిపోయినాముగాని విని చెడిపోయినది లేదు. నీ సలహాను వినగోరుతాను.