పుట:Naayakuraalu.Play.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

91

2--వ రంగము

గురిజాల - రాజమందిరము

[ నలగామరాజు, నాగమ్మ, నరసింగరాజు ప్రవేశము ]

నల. రా : ఇప్పటి కొకవిధంగా గట్టెక్కినట్టే. పల్నాటిని బాధించుతున్న అంతఃశత్రువులను సరిహద్దుల వెలుపలికి తరిమాం. బయటిశత్రువులకంటే లోపలిశత్రువులు ఎక్కువ అపాయకారు లనేది దేహములోని శత్రువులకూ, దేశములోని శత్రువులకూ కూడా వర్తిస్తుంది. మా కుటుంబము యొక్క ప్రాపున తరములనుండి యెల్లవిధముల పేరు ప్రతిష్ఠల బొంది, అదంతా మరచి, చివరకు కుటుంబకలహములు బెంచి, తానే యేడుగడని నమ్ముకొనివున్న మమ్మును మోసగించి, బెదరించి, రాజ్య మపహరించిన బ్రహ్మనాయుని కృతఘ్నత జ్ఞాపకమునకు వచ్చినప్పుడల్లా విచారం గలుగు తుంది. కాని యితరులకు చెప్పడం సులభం, తాను చేయడం కష్టం. మాకు పరోపకారులయిన వారియెడల మేమయినా కృతజ్ఞులమై వుంటే చాలు. మిక్కిలి కావలసిన వాండ్లు సహితం శత్రువులలో గలిసిపోయి, చిక్కులలో ముణిగివున్న మాకు కొండవలె అండయి నిలిచి బృహస్పతిని మించిన తన మేధాసంపత్తిచేత దేశమును, మమ్మును ఉద్ధరించిన నాగమ్మగారిని కలకాలము మరువకుందుము గాక !

నాయ : దైవసేవ, దేశసేవ, రాజసేవ - మూడూ కలిసివున్న యీ మహత్కార్యవిషయమున నే జేసిన అల్పసేవను ఏలినవా రింతగా ప్రశంసింప పని లేదు. నా ధర్మం