పుట:Naayakuraalu.Play.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

నాయకురాలు

పోగా, కాళ్లక్రిందవున్న మాచర్లకూడా బెసికిపోయింది. రెంటికీ జెడ్డ రేవడల మయినాం.

బ్రహ్మ : విజయం రొంపిలో స్తంభం. ఎటు వొరుగుతుందో చివరవరకూ చెప్పలేము. ఒకడు యెల చేతికందినట్టే భావించి చేయి చాచుతాడు. జయలక్ష్మి వాణ్ణి కసిరికొట్టి మఱివొకడికి చేయి అందిస్తుంది. ఒకడు చెట్టు యిండె బెట్టి నరికి ఒకవైపుకు లాగుతాడు. అది మఱివొక వైపుకు విరుసుకొని యిండ్లను భగ్నము చేస్తుంది. న్యాయాధిపతి విచారణ పూర్తిజేసి ఒక వైపు అభిప్రాయం తేల్చుకొంటాడు. కాని యే స్వల్ప అనుమానమో తగిలి కథ అడ్డంగా తిరుగుతుంది. విరగబండి కోసి ఆరవేసిన పనలు చేలమీద పరవంజివుంటవి. ఈనగాచి నక్కలపాలు జేసినట్లు ఒక్క వానతో అంతా ముగుస్తుంది. విధియొక్క చెయ్దిము లిట్టివని చెప్పవీలులేదు. విజయకారణము ధనంగాని, దేహబలంగాని, సైన్యబాహుళ్యంగాని, ఆఖరుకు బుద్ధిబలంగాని కాదు. అదృష్టమే కారణము.

కొమ్మ : గాలిలో దీపంబెట్టి దేవుడా నీ మహిమంటే యేమి ప్రయోజనం. తెలిసి తెలిసి చేతులమీదుగా రాజ్యం పోగొట్టుకొన్నాం. అతిసంచయేచ్ఛ తగదు. కలిగిన దానితో తృప్తిజెందివున్నట్టయితే యింతముప్పు వాటిల్లక పోయేది.

బ్రహ్మ : గెలుపోటము లెవరికీ ముందుగా దెలియవు. గెలువ గలమను ఆశ లేనిది యెవడూ యేపనీ తలపెట్టడు. ఆశయే ఆరంభముల కన్నిటికీ మూలము. సంశయములకు లోనయ్యేవాడు యేపనీ నిర్వహించలేడు. సాహసము